Others

వాజపేయికి అక్షర నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటి దాకా భారతంలో
రెండు సమున్నత శిఖరాలుండేవి అండగా
ఉత్తరాన మంచు పర్వతం
హస్తినలో మానవ శిఖరం
ఇప్పుడు మంచు పర్వతమే
ఏకాకిగా మిగిలింది!

నిన్నటి దాకా హిందూ మహాసాగరంలో
కమలం విరబూసేది కరుణ దళాలతో
కాంతులు చిందుతూ
నేడు కళావిహీనమై
సాగరమే మిగిలింది

నిన్నటి దాకా జీవనదులు
స్నేహభావ గీతికలుగా ప్రవహించేవి
ఏ భావకవి హృదయమో
ఆవహించినట్టుగా
అనుసంధానమై అల్లుకోవాలని
నేడు తోచిన దిక్కుకి
పరుగులు తీస్తున్నాయి
ఏదో పోగొట్టుకున్నట్టుగా!

అయ్యా.. అటల్ బిహారీ వాజపేరుూ..
నిత్య చైతన్యంతో ప్రవహించీ, ప్రవచించీ
అంతలోనే అంతర్థానమయ్యావు
సరస్వతీ నదిలా!
అయినా అంతర్వాహినిగా నిలిచిపోతావు
మా హృదయాంతరాళాల్లో
అజరామరంగా..

--డా. డీవీజీ శంకరరావు