Others

ఉత్ప్రేరకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరి దూషణలు.. నిర్లక్ష్యాలు
నొసటి చిట్లింపులు.. హేళనలు
సుత్తిపోట్లు ..
ఉలి గాట్లు లాంటివి
హృదయాన్ని తూట్లు పొడుస్తాయి
అందుకే గుండెని రాయి చేసుకో!
అందమైన శిల్పం గా మారుతావు
గుడిలో విగ్రహంగా వెలుస్తావు
లేదా
అలమరాలో షోపీసు గా మెరుస్తావు

నీకు మూర్తి మత్వాన్ని అందించిన
ఉలి, సుత్తి ఇప్పుడెక్కడుంటాయి?
తుప్పు పట్టి ఏ గూట్లోనో ఉంటాయి!
ఎవరు పట్టించుకున్నా లేకున్నా
నువ్వు వాటిని గుర్తుపెట్టుకో
నీ ఉన్నతికి అవే ఉత్ప్రేరకాలు!!

-- టి.వి.ఎల్.ఎన్.మూర్తి