Others

ఆసక్తి ఉంటే ఆదాయం ముంగిట్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు నేడు అడుగు పెట్టని రంగం లేదు. షేర్ మార్కెటు పట్ల మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు కానీ డబ్బు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. కేవలం ఇందులో ముందుకు రావాలంటే కొన్ని మెళుకువలు నేర్చుకుంటే చాలు ఇక్కడ లాభాపేక్ష తప్పనిసరిగా ఉండాలి. నష్టపోతామని అనుకొంటే వెంటనే ఆ సంస్థనుంచి పెట్టుబడులు వెనక్కు తెచ్చుకోవాలి. లేదంటే అసలు వాటి జోలికి పోకూడదు. ఏదోమార్కెట్ ట్రెండ్‌ను బాగా అర్థం చేసుకోవాడానికి సమయం పట్టినా ఫర్వాలేదు అనుకొని ముందు అవగాహనను పెంచుకోవాలి. ఏ షేర్ ఎలా పెరుగుతోందో అర్థం చేసుకోవాలి. స్టాక్ ట్రేడింగ్ మహిళలకే మంచి లాభసాటి వ్యాపారం అని మార్కెటు నిపుణులు చెబుతారు. ఇంట్లో ఉండే స్టాక్ మార్కెటులో లాభాలను లెక్కించుకోవచ్చు. కాని ఇక్కడ భావావేశాలు , సెంటిమెంట్లు పనికిరావు. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొనే నేర్పు అలవర్చుకోవాలి. ఒకసారి అనుకొన్నంత లాభాలు రాలేదని వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్లాలి.
ఎక్కువగా స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక ప్రణాళిక ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందనేవారు ఉన్నారు. కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల కాలం పెట్టుకుంటే మంచిదే. మనదేశంలో 7 శాతానికి మించిన మహిళలు ఈ స్టాక్ మార్కెట్‌లోకి రావడం లేదు. దీన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. కానీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మహిళలు ఇంతవరకు విజయాలనే చూస్తున్నారు. 2.3 శాతం మగవారికన్నా మహిళలే ఈ వ్యాపారం లాభాలను ఆర్జిస్తున్నారని ఒక సర్వే వారు చెబుతున్నారు. కొత్తల్లో లాభాలు రాకపోయినా నిరుత్సాహం చూపివ్వకుండా కొన్ని రోజులు మార్కెటును స్టడీ చేస్తూ ఉంటే తప్పక లాభాల బాట పట్టవచ్చు. ఒక్కసారి మెళకువలను తెల్సుకుంటే ఈ రంగంలో ప్రవేశించిన మహిలలు వెనక్కు రమన్నా రారు. ఒకే సంస్థలో పెట్టుబడులను పెట్టకుండా అది కూడా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో వివిధ సంస్థల్లో పెట్టుబడి మారుస్తూ ఉంటే తప్పక లాభాలు వచ్చి తీరుతాయి. క్రమశిక్షణతో ప్రతిరోజు స్టాక్ మార్కెటు లో ఏయే మార్పులు వస్తున్నాయో తెలుసుకొంటూ ఉండాలి. అపుడే స్టాక్ మార్కెట్‌లోను మహిళలు ఊహించన విధంగా ఎదుగుతారు. లాభాలు చేపడుతారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ ఉంది కనుక ఇంట్లో లాప్‌టాప్‌ల్లో కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రతిరోజు కొన్ని గంటలు నిశితంగా చూస్తు ఉంటే ఆసక్తితో ఏ సంస్థలు లాభాల బాట పడుతున్నాయ, లేదా ఎవరు ఏస్టాక్ మీద పెట్టుబడులు పెడుతున్నారో తెలుసుకొంటే చాలు. ఒకవేళ నష్టాలు వస్తాయ అనుకొంటే ముందు ఏ స్టాక్ బ్రోకర్ ద్వారానైనా మార్కెటు పెట్టుబడి పెట్టి కొన్నాళ్ల తర్వాత మీరే మార్కెటు లోకి ప్రవేశించవచ్చు. అదీ కాదనుకొంటే మొదట డెమో అకౌంట్‌ను ఓపన్ చేసి కొన్నాళ్ల మార్కెట్ స్టడీ చేసి తరువాత ఒరిజినల్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ముందు స్టాక్ మార్కెటులో నిత్యం వాడే పదాలు, వాటి అర్థాలు వీటిమీద దృష్టి పెట్టాలి. ఎందుకు ఏ పదం వాడుతున్నారో అర్థం చేసుకొంటే స్టాక్‌మార్కెటు లో పెట్టుబడులతో పెద్ద కష్టం లేకుండా లాభాలను ఆర్జించవచ్చు. మరి మహిళలలూ ముందుకు వస్తున్నారు కదూ.

-- జంగం శ్రీనివాసులు