Others

సమాంతర సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసుక తినె్నలు
నా భారాన్ని మోయలేక
పాదముద్రల సొట్టలు పడుతూ
పశ్చిమ తీరానికి నన్ను ఆహ్వానిస్తున్న
శుభ సాయం సంధ్యవేళ..
ఎదురుగా నా ఆయుష్షుకు
ప్రతిరూపంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు
ఏదో చల్లని చెమరింపు స్పర్శ
నా అరిపాదాల క్రింద...
అణువణువూ విస్తరిస్తూ
పైకి పాకుతున్న అనుభూతి...
అస్థిత్వపు చలనాన్ని కలుగజేస్తూ చిన్న కదలిక..
నా నిరాశా నిస్పృహల నయనాలు
వాలుతున్న సంధ్యను అనుసరిస్తూ..
నా పాదాల వైపు...
సన్నని నీతటిపాయ నన్ను చుట్టుకుంటూ
వాగులా మారి నదీ ప్రవాహమై
నిలువునా పరిమళింపచేస్తూ.. తరూలతయై
అల్లుకుపోతోంది..
ఏం కావాలన్నా నా నేత్రావధానానికి
ఆవేశం ఆయాసం లేని సంగమంలో
నీ పదము సోకిన గౌతమిగా
మిగలనీ మిత్రమా అన్న నిశ్శబ్ద సందేశం...
ఇపుడు నా ఎదురుగా ఆశల అరుణోదయం
తన జలహస్తం.. నా వామహస్తంలో..
లయబద్ధంగా మమేకవౌతూ..
ఒక అనంత జలగీతం
ఆలపిస్తూ మేమిద్దరం.. వౌనంలోకి!!

-- కొత్తపల్లి ఉదయబాబు.. 9533756075