Others

పోటీ మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. దాన్ని ఎవరూ కాదనరు. అసలు స్పర్థ నాణ్యమైన సరుకును ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుంది. సరుకే కాదు పనిలోను అంతే. ఎదుటివారికి ఎక్కువ వచ్చేస్తోంది అన్న అసూయా ద్వేషాలతో కాకుండా వారి దగ్గర ఉన్న పనిలోని మెళుకువలను ప్రోత్సహిస్తూ మనకు రానివేమన్నా ఉంటే నేర్చుకుంటూ పనిని సాగిస్తే మంచిదే. ప్రతి మంచి పనికి పోటీ అవసరమే.పోటీ వల్ల అనుకొన్నదానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయి.
ఎట్టి పరిస్థితుల్లోను పోటీ వల్ల ఈర్ష్యాసుయలు దగ్గరకు రానివ్వకూడదు. అవి ఎదుగుదలకు అడ్డంకులుగా నిలుస్తాయి. నేటికాలంలో మహిళలే కాదు పిల్లలూ పరుగెత్తి పాలు తాగుతున్నవారే. నిద్ర లేచింది మొదలుకుని మళ్లీ పడుకునేదాకా అంతా పరుగులే. అట్లాంటపుడు పోటీ అంటే ఇతరులతో పోటీ మంచిదా అంటే ఎన్నివిధాలుగా చూసినా మంచిది కాదు. కానీ మంచి పనులుచేయాలనే పోటీ మాత్రం మంచిదే. చదువులో కూడా స్పర్థ మంచిదే
పిల్లల్లో క్లాసులో అందరికన్నా నేను బాగా చదువుకోవాలి అని చదవడం వరకు మంచిదే. మార్కుల విషయం వచ్చేసరికి నాకన్నా ఎక్కువ ఎవరికీ రాకూడదు అనుకోవడం మాత్రం తప్పు. పరీక్షల్లో సమాధానాలు రాసే పద్ధతి అంటే ప్రజంటేషన్, ఒత్తిడి లేకుండడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇవన్నీ పరీక్షల్లో తెల్సుకుని మరీ క్వశ్చిన్స్ కు ఆనర్స్ రాయాల్సి ఉంటుంది. అపుడే వారు అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. నేను అన్నీ చదివాను. కనుక నాకే అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలి అంటే కుదరదు.
కానీ చదువులో బట్టీలు పట్టడం కాక చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. పాఠాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. ఎందుకిచ్చారు ఈ పాఠాన్ని. దీన్ని చదివితే నాకు తెలిసేది ఏమిటి అనుకోవాలి. ఆ తరువాత ఏ ప్రశ్న ఇచ్చారు దానికి సమాధానం ఏమివ్వాలి అన్నదీ ఆలోచించుకోవాలి. అపుడే ప్రశ్నకు తగ్గ సమాధానం రాయగలుగుతారు. అట్లానే చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే మంచిదే. ఒక్కోసారి చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన ఉండదు. అట్లాఅని నాకు వీటి గురించి తెలీదు అంటే సరిపోదు. అక్కడ ట్రైనింగు తీసుకోవాలి. ఇంతకుముందు పని చేసిన వారి సలహాలు తీసుకోవాలి. పని గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాత రోజు రోజుకు టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులను తెలుసుకోవాలి. చేస్తున్న పనిలో మెళుకువలను నేర్చుకుని పని చేస్తే ఆ పని అర్థవంతంగా ఉంటుంది. అందిరినీ మెప్పిస్తుంది.
ప్రతి మనిషికీ కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు లక్ష్యాలను పునఃసమీక్షించుకోవాలి. లక్ష్యాలను చేరుకునే పని చేస్తున్నామా లేదా అని సరిచూసుకొంటూ ఉండాలి.
లక్ష్యాలను చేరడానికి కొత్త పద్ధతులేమన్నా ఉన్నాయా అని కూడా చూసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోను ఇతరులతో పోటీ పడకూడదు. వారికున్న పరిస్థితులు మీకున్న పరిస్థితుల్లో తేడాలుండచ్చు. కనుక పోటీ మీకు మీరే కావాలి.
అనుకొన్న పనిని నెరవేర్చడానికి ఒక ప్రణాళికను వేసుకోవాలి. సాధ్యమైనంతగా ఆ ప్రణాళిక ప్రకారం చేయాలి. సమయాన్ని ఏ పనికి ఎంత అవసరమో అంత విభజించుకుని ఆ సమయంలోనే ఆపనిని పూర్తి చేయడానికి వినియోగించాలి.
ప్రతిమనిషిలోను కొన్న లోపాలుంటాయి. అవి ఇతరులకు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి వారికి ఆలోపాల గురించి తెలిసే ఉంటుంది. వాటిని అంగీకరించి ఆ లోపాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. లోపాలను సరి చేసుకుంటూనే ముందుకు వెళ్లాలి. ఇతరులతో పోటీ నో పోలికనో పెట్టుకుంటే అసలుకు ఎసరు వస్తుంది. వారి బలాలు బలహీనతలు మీకు తెలియకపోవచ్చు. కనుక మీకున్న బలాలేమిటో ఏపనులను సులువుగా చేయగలుగుతారో, ఏపనులు మీరు చేయలేకపోతారో ముందు తెలుసుకోవాలి. ఆ తరువాత మీరు చేయలేనట్టి పనులను ఇతరులతో చేయించుకోవాలి. దీనితో ఇతరులకు కూడా మీరు సాయం చేసినట్టు అవుతుంది.
ఒక్కోసారి అనుకొన్న పనిని చేసే శక్తి మీకుంటుంది. కాకపోతే అనుకొన్న సమయంలో పూర్తి చేయలేకపోవచ్చు. కనుక మీకొచ్చిన పనిని ఇతరులకు నేర్పించి వారి చేత ఆ పనిని చేయించుకుని వారికి తగిన ప్రతిఫలం ఇచ్చేస్తే మీరు అనుకొన్న పనిని సకాలంలో పూర్తి చేసినట్టు అవుతుంది. పైగా ఇతరులకు సాయం చేసే వీలు కలుగుతుంది. ఏ పనిని ఎంత చేయాలి. ఏ సమయంలో చేయాలి. ఎంతమందితో పూర్తి చేయగలం అన్న ప్రశ్నలు ముందే ఆలోచించి ఆతరువాత పనిని మొదలుపెడితే తప్పనిసరిగా ఆపనిలో విజయం మీదే అవుతుంది.

- లక్ష్మీప్రియాంక