Others

నాకు నచ్చిన చిత్రం--భార్యాభర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజారంజకమైన చిత్రాలు నిర్మించడంలో ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ముందువరసలో ఉండేది. ఒక బెంగాలీ నవల ఆధారంగా నిర్మించిన చక్కటి భావోద్వేగాలున్న చిత్రం ‘్భర్యాభర్తలు’. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమారుడైన ఏఎన్నార్ విలాసవంతంగా అమ్మాయిలతో ‘జోరుగా హుషారుగా’ అంటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూంటాడు. మధ్యతరగతి కుటుంబీకురాలైన కృష్ణకుమారిని ప్రేమిస్తాడు. ఏఎన్నార్ గురించి తెలిసినా తండ్రికోసం అతనితో వివాహానికి సిద్ధపడుతుంది.
స్నేహితుల సమక్షంలో ‘ఏమని పాడెదనో’ అంటూ తన జీవితం బంగారు పంజరంలో చిక్కుకున్న చిలకలా ఉందన్న మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె పూర్తిగా ఇష్టపడినప్పుడే కాపురం చేస్తానంటాడు ఏఎన్నార్. బయటకు భార్యాభర్తలుగా నటిస్తూ సంసారంలో ఎడబాటుగా ఉంటారిద్దరూ. పాత జీవన విధానాన్ని మార్చుకుని భార్యకు చేరువయ్యేందుకు చేరువయ్యే ప్రయత్నంలో విజయం సాధిస్తాడు హీరో. సరిగ్గా అదే సమయంలో గత జీవితంలో పరిచయమైన గిరిజ ప్రేమలేఖలతో బ్లాక్‌మెయిల్ చేయడం, ఏఎన్నార్ ధిక్కరించటం, గిరిజ హత్యకు గురవ్వటం, ఆ నేరం హీరోపైపడి జైలుపాలవ్వడం జరుగుతాయి. తండ్రే అతనికి వ్యతిరేకంగా కోర్టులో వాదించాల్సి రావడం, కృష్ణకుమారి సాహసం, రేలంగి లాయర్‌గా తన వాదనతో నిజం నిరూపించి హీరోను నిర్దోషిగా నిరూపించి అసలు హంతకుడు పద్మనాధం అని ఋజువు చేయడంతో సినిమా ముగుస్తుంది. ప్రత్యగాత్మ దర్శకత్వ ప్రతిభకు ఈ చిత్రం ఒక నిదర్శనం. సాలూరి రాజేశ్వరరావు పాటల స్వర బాణీలకు ఘంటసాల, సుశీల, జిక్కి తమ గాత్రాలలో ప్రాణం పోశారు. హాస్యం కథలో ఇమిడివుండి చిత్రానికి బలం చేకూర్చింది. నేటికీ బుల్లితెరపై అలరిస్తున్న సంగీత భరిత కుటుంబ చిత్రం.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం