Others

విపత్తుల నివారణకు శాశ్వత చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంచనాలకు అందకుండా అనూహ్యంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు. ఇవి జీవకోటిని సర్వనాశనం చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరగడం అనివార్యమైంది. అపార నష్టాన్ని కలిగిస్తున్న ప్రకృతి వైపరీత్యాల్లో కరవులు, వరదలు, భూకంపాలు జన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అతివృష్టి వల్ల వరదలు, అనావృష్టి వల్ల కరవులు సంభవిస్తున్నాయి. సముద్రాలలో ఏర్పడే భీకరమైన వాయుగుండాల వల్ల విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. తద్వారా నదులు ఉప్పొంగి వరదలు వస్తున్నాయి. ఇవి గ్రామాలు, పట్టణాలు, మహానగరాలు అనే తేడాలేకుండా జనావాసాలను ముంచేస్తున్నాయి. మనకు జీవనాధారమైన నదులు ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహించి, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. పంటలు నాశనమవుతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి. అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎంతోమంది దిక్కులేని వారుగా మిగులుతున్నారు.
1977లో వచ్చిన దివిసీమ తుపాను చరిత్రలో మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. 1983లో సంభవించిన గోదావరి వరదలు ఇంకా ఆ గాయాలను గుర్తుచేస్తూనే ఉన్నాయి. 27 సెప్టెంబర్ 2009న శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చిన భారీ వరదనీరు కర్నూలు రూపురేఖలను ఏ విధంగా మార్చేసిందో మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. దాదాపు 40,000 మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పవిత్ర పుణ్యస్థలం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి గుడిసహా అనేక ప్రదేశాలు 10 అడుగుల మేర వరదనీటితో మునిగిపోయాయి. అనేకమంది ప్రాణాలను కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైమానిక దళం, నావికాదళం, ఆర్మీ, విపత్తుల నిర్వహణ సిబ్బంది, సామాజిక సంస్థలు, సేవాకార్యకర్తలు సహాయక చర్యలను సమర్ధవంతంగా నిర్వహించారు. తాజాగా కుండపోత వర్షాలతో దాదాపు 100 సంవత్సరాల కాలంలో నిండని డ్యామ్‌లు పొంగిపొర్లడంతో కేరళ రాష్ట్రం భీతావహంగా మారింది. కేరళకు అన్ని వర్గాల నుంచి సహాయం అందడం ప్రారంభమైంది. వరదలు ముంచెత్తినపుడు ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలను నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సామే.
ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోలేక మానవుడు సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. ప్రకృతిని జయించాలని తపన పడుతున్నాడు, కానీ తను చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని ఆపలేకపోతున్నాడు. జీవావరణం విషయంలో వ్యాపార దృష్టి, లాభాపేక్షను వీడాలి. వృక్ష సంపదను విరివిగా పెంపొందించాలి. భూసారాన్ని పరిరక్షించుకోవాలి. నదీ పరీవాహక ప్రాంతాలను ఆక్రమించిన వారికి చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలి. విపత్తుల నిర్వహణకు సంబంధించిన కోర్సులను కళాశాలలో ప్రవేశపెట్టి, వాటిని చదవాలనుకున్న విద్యార్థులకు తగు ప్రోత్సాహకాలను అందించాలి. విపత్కర పరిస్థితులలో ఇతరుల నుంచి సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి రాకముందే ప్రత్యేక సహాయనిధిని కేంద్రం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాశ్వత చర్యలను ప్రారంభించాలి. జాతీయ విపత్తు సహాయ నిధికి ఏడాది పొడవునా విరాళాలను సేకరించేలా ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పరచి, దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలి.

చిత్రం..కేరళలో జల విలయం

-సూరం అనిల్ 90594 57045