Others

విశ్వమంత విశ్వాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఆత్మీయ పలకరింపు
బరువెక్కిన గుండెను
తేలికపరచగలదు.

చేరువైన ఒక బంధం
ఒంటరితనాన్ని
దూరం చేయగలదు.

ఒక ఆశావహ దృక్పథం
నైరాశ్యాన్ని తొలగించి
ఉత్సాహాన్ని నింపగలదు.

ఒక ప్రేమాస్పద వైఖరి
వైరి భావాన్ని హరించి
స్నేహతత్వాన్ని పెంపొందించగలదు.

ఒక విస్పష్ట ఆలోచనా ధోరణి
శూన్యాన్ని పోగొట్టి
కార్యశీలత నందించగలదు.

నమ్మకాలన్నీ నిజాలు కాకపోవచ్చు
ఎంత బలీయం కాకపోతే
ఈ నమ్మకాలు నిజాలై కూచుంటాయి
ఎంతలా విశ్వసనీయత కాకపోతే
ఇంతలా విశ్వవ్యాపితం కాగలుగుతాయి.

ఫలితం ఉంటుందా! లేదా?
అన్న సందేహం లేదు
జరుగుతుందో లేదోనన్న
అనుమానం లేదు
ఏమో! ఎట్లో! అన్న
మీమాంసకు తావులేదు.

ఇక్కడ విశ్వాసానికి
వాస్తవానికి
పెద్ద తేడా ఏమీ లేదు
ఘటనకు ముందున్న విశ్వాసమే
ఘటనకు తరువాత వాస్తవమైంది.
మనపై మనకు కలిగే
నమ్మకాలు కూడా ఇలానే ఉండాలి
అవి సమస్యలను అధిగమించాలి
విజయాలను వరించాలి
నిండైన ఆత్మవిశ్వాసం
ప్రతిశ్వాసలోనూ ప్రతిఫలించాలి.
*

-కె.రవీంద్రబాబు.. 9052778988