Others

ఆహ్వాన గీతిక ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవాళ్లతో సర్దుకోవడం కాస్త ఇబ్బందికరమే. అందులోనూ కొత్త పెళ్లికూతురు అత్తవారింట్లోకి అడుగుపెడితే అక్కడి పరిస్థితులు, వాతావరణం తో సర్దుకుపోవడం మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. కానీ మనసుంటే మార్గముంటుంది. మనుష్యులపై ప్రేమను పెంచుకుంటూ వెళ్లితే అందరూ మనకు కావాల్సిన వారే అవుతారు. పెద్ద పెద్ద కోరికలతో అడుగుపెట్టి అక్కడ అసలు కోరికలు తీరే అవకాశం లేకపోతే నిరాశ ఎదురవుతుంది. అపుడు వారంతా దోషుల్లా కనిపిస్తారు. ఎప్పుడూ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. కొత్తకోడల్ని కోరి ఆహ్వానిస్తున్నారు కనుక వారంతా నేను వారింట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారన్న ఆశావహదృక్పథంతో వెళ్లాలి. అంపకాలప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు మీ అత్తింటి అణుకువగా ఉండు వారిని ఎదిరించకు అని చెప్పి పంపినా మీ ఆశావహ దృక్పథమే మిమ్మల్ను నిలబడెతుంది.
అత్తవారింట్లో కూడా కొత్త కోడలు కోటి ఆశలతో వస్తుంది. ఆమె కనీస ఆశలను తీర్చేట్లుగా మనం ఉండాలి అనుకోవాలి. కొత్త అమ్మాయి కనుక తను ఇంట్లో నలుగురితో కలసిమెలసి ఉండేందుకు నలుగురూ సాయం చేయాలి. తనకు తెలియనవి కోపంతో కాక నవ్వుతూ చెప్పాలి. వారింట్లో ఒకలాంటి అలవాట్లు ఉండొచ్చు. సంప్రదాయాలు వేరుగా వుండవచ్చు. మెల్లగా ఈ ఇంటి అలవాట్లు, ఆచారాలను గురించి చెప్పాలి. అంతేకానీ ఛీ ఛీ ఇదీ తెలియదా అన్న కామెంట్స్ చేయకూడదు.
వంటల విషయంలోకూడా బాగా చేయలేకపోతే ఫర్వాలేదులే చేస్తూ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. నిన్నటిదాకా పొయ్యి దగ్గరకు వెళ్లే అవకాశం నీకురాలేదుకదా అనాలి. మీకు ఏం కావాలో వాటిని మెల్లగా నేర్పించాలి. అంతేకానీ మీ అమ్మ ఇలా నేర్పించిందా అని కామెంట్ చేయకూడదు.
అత్తవారింట్లో ఉన్న నలుగురు ఒక అలవాటు కలిగి ఉంటారు. కొత్తగా వచ్చిన అమ్మాయి కనుక వారి అలవాటును అర్థం చేసుకోవాలి. అంతేకానీ నా అలవాట్లను మీరంతా నేర్చుకోండి అంటే కుదరదు. మంచి ఏదైనా అత్తగారిలో ఉంటే నేర్చుకోవాలి. అత్త కనుక ఆ పోస్టు మంచిది కాదుఅనే అభిప్రాయంతో ఆమె ఏమి చెప్పినా చికాకును వ్యక్తపర్చకూడదు. ఏం చెబుతోంది. ఎందుకు చెబుతోందో అని ఆలోచించాలి.
కొత్త కోడలి గురించి కూడా అత్తగారు కాస్త నిదానంగా ఆలోచించాలి. నేడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది. కష్టంలేకుండా అనుకొన్న పనులు సాగేట్టుగా చేసే నేర్పును ఈ తరం పిల్లలు నేర్చుకుంటున్నారు. కనుక పాతకాలం పద్ధతుల్లోనే చేయాలి అనుకోకుండా ఏ పనైనా ఏ రకంగాసులువుగా చేయవచ్చో చెప్పి మీకన్నా సులువుగా చేసే నేర్పు కొత్త అమ్మాయికి ఉంటే అభినందిస్తూ అట్లానే చేయమని చెప్పాలి. కోడలు నా కొడుకును నాకు దూరం చేస్తుందేమో అన్న అపోహను ముందు పోగొట్టుకోవాలి. అసలీ అనుమానాన్ని మొదట్లోనే తుంచేసేయాలి.
పెళ్లి చేసుకొని దాంపత్యబంధాన్ని ఆహ్వానించి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవితం గడపాలని వచ్చే అమ్మాయి అత్తగారింట్లో నేను ఒక సభ్యురాలిని కావాలనుకొంటుంది కానీ అత్తంట్లో ఎవరూ ఉండకూడదనే అభిప్రాయాన్ని కలిగించుకుని రాదు అనుకోవాలి.
ఇలా ఇరువురూ ఒకరి గూర్చిమరొకరు మంచి ఆలోచనలతో ఉంటే ఆ మొదలెట్టే బోయే సంసారం బాగుంటుంది.
కొత్త గా వచ్చిన అమ్మాయి చిన్న విషయాల్లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలను గౌరవించడం, లేదా ఆడపడచును ఆదరించడం, పిల్లలుంటే వారిని ప్రేమగా పలకరించడం లాంటివి చేయాలి. పని చేయకపోయినా ఫర్వాలేదు కానీ ఇంట్లో ఉన్న సభ్యులతో మర్యాదగాను, ప్రేమగాను కలసి మెలసి ఉంటే ఒకవేళ పని రాకపోయినా మెల్లగా నేర్చుకుంటుందిలే అన్న భావన అత్తవారింట్లో వస్తుంది.
అట్లా కాక కొత్తగా ఇంట్లోకి రాగనే అబ్బా వీరితో నేను మాట్లాడలా అనో లేదా చిన్న పిల్లలు వస్తే వారిని విసుక్కోవడం పెద్దవాళ్ల తో అమర్యాదగా ఉండడం చేస్తే వెంటనే కొత్తకోడలి మీద చెడు అభిప్రాయం కలుగుతుంది.
అట్లానే అత్తగారింట్లో వాళ్లు కూడా వచ్చిన కోడలిని శల్యపరిక్ష కు గురిచేయకూడదు. నీకు ఇది వచ్చా అది చేయగలవా అంటూ ప్రశ్నలతో వేధించకూడదు. ఏదైనా తనకు రాదు అని చెబితే ఫర్వాలేదులే నేర్చుకోవచ్చు అని ప్రోత్సాహకరంగా మాట్లాడాలి. అపుడే ఇరువురు సంతోషంగా ఉండొచ్చు.

--మానస