Others

అవరోధాలే అవకాశాలుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు ఒక్కరుగా కాక నలుగురితో కలసి టీంవర్క్‌లోకూడా ముందజ వేయాలంటే అందులోను నేటి స్పీడ్ యుగంలో ముందుకువెళ్లాలంటే వారిని వారు బాగా తెలుసుకోవాలి. స్వీయ విశే్లషణ ద్వారా తమ లోపాలను గుర్తించాలి. వాటిని అధిగమించేందుకు కృషి చేయాలి. లోతుగా అధ్యయనం చేయగలగాలి. వారిని వారు తెలుసుకొంటే ప్రపంచానే్న జయంచవచ్చు. నిన్ను నీవు తెలుసుకో అని మహర్షులు కూడా చెబుతుంటారు. ఆ సమస్య ఆధ్యాత్మికంగా కనిపించినా లౌకికంగా ఈ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ముందు మనలను మనం ఒక అంచనా వేసుకోవాలి. అపుడే దేనినైనా సాధించడానికి మార్గాన్ని అనే్వషించవచ్చు.
ఈ అంశాలు మీరు ఒక్కసారి చూసుకోండి జవాబులు ఎలా వస్తాయో చూసి దాన్ని బట్టి మీ పై ఒక అవగాహన మీరు రండి.
* మీరెప్పుడైనా విజయాన్ని పొందితే అది నలుగురితో చెప్పగలరా?
* మీరొక్కరే ఎంత సులువుగా పని చేస్తారో అట్లానే నలుగురితో కలసి పని చేయగలరా? చేయంచగలరా ?
* ప్రతికూల పరిస్థితులోను బాధ్యతలను స్వీకరించి జయాన్ని తీసుకొస్తాను అనే నమ్మకం మీ పైన మీకు ఉందా?
* అనుకొన్న గమ్యాన్ని చేరడానికి లక్ష్యాలు ఏర్పరచుకుని సాధించేందుకు కృషిచేయగలను అనే భరోసా మీపై మీకు ఉందా?
* పూర్తి నమ్మకం, విశ్వాసం మీలో ఉంది అనుకొనే సందర్భంలోను ఇతరులు కూడా మీరు చెప్పిన పనిని చేయగలరని విశ్వసించగలరా?
* అనుకోని ఆపదలు వస్తే వాటిని ఎదుర్కోగల సామర్థ్యం మీలో ఉందా?
* ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాటిని ఇతరులతో పంచుకోగలరా?
* ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా ఉండగలరా?
* నలుగురిని ఒప్పించే ధైర్యం ఉందా? ఒకవేళ ఎవరైనా మీరు చెప్పే పనిని చేయలేరు అని వాదిస్తే వారికి కోపంలేకుండా పనిని ఏవిధంగా చేయవచ్చో వివరించగలరా?
* ఇతరుల్లో మీకు లేని గొప్పదనం కనిపిస్తే దాన్ని ఆహ్వానించగలరా?
* ఇతరులు పని గురించి వారికి తెలిసిన సమాచారం చెప్తే మీరు విసుక్కోకుండా వినగలరా? మంచి మార్పులు చెప్తే వాటిని మీరు ఆచరణలో పెట్టగలరా?
* నా మిత్రులంతా నన్ను ధైర్యవంతుడంటుంటారు.
* అనుకోని పరిస్థితులు అదేపనిగా తలుపు తడుతున్నా మరో మార్గాన్ని సూచించగలరా? వెతుక్కోగలరా?
ఈ లక్షణాలు మీలో ఎన్ని, ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. ఎక్కడైనా లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
వీటినన్నింటితోపాటు స్వీయ గౌరవం పెంపొందించుకోండి. పరిపూర్ణ వ్యక్తిత్వం, ఆరోగ్యం కూడా సరిచూసుకొంటూ ఉండాలి.. అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మార్పును స్వీకరించాలి. అవరోధాలను అవకాశాలుగా స్వీకరించి సాగిపోతే విజయావకాశాలు మీవే. అందరిలోను మీరు ప్రత్యేకంగా నిలబడగలిగే సామర్థ్యమున్నవారిగా ముద్ర కూడా మీదే.

--శ్రీలత