Others

ఆంధ్ర కేసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ధైర్యమునకొకింత ధైర్యమొసగు మేరు
నగధీర గంభీర సుగుణమూర్తి
స్వారాజ్య సంగ్రామ సవనమందు, తనదు
సొమ్ములన్ వ్రేల్చిన సోమయాజి
సాహసంబునకొక సాదృశ్యరూపవౌ
ఆంధ్ర ప్రజా హృదయాధినేత
స్వార్థమన్నది లేని పరమార్థవిదుడు, సం
సార మందున్న నిష్కామయోగి

తే.గీ దేశ సేవాపథంబున లేశమైన
విశ్రమంబెరుగనియట్టి వీరవరుడు
ఆతడాంధ్రకేసరి, ఎవ్వరతనికి సరి
తరతరాలకు తిరమైన తరగని సిరి!

--డి.వి.ఎం.సత్యనారాయణ 98858 46949