Others

దాహంగొన్న కవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాస్తేనే కవిత్వమా
మరి..
మెదడు జీర్ణించుకోలేని
సందర్భాలలో వేదన వినే దిక్కెవరు?
మెచ్చుకోలును ఒప్పుకోని ఈగో
సన్మాన పీఠమెక్కడానికి
తయారవుతోంది రేపటి లోగో
తేనె పొగడ్తల మాటల వెనక
విషపూరిత సమాలోచనలు
గుండెకు అర్థమవుతూనే ఉంటాయ్
ప్రతిభను ప్రోత్సహించే పెద్ద మనుషులు
గద్దలకూ తెలుసు ఆహారాన్ని
ఎలా పట్టుకోవాలో
అడుగడుగునా భుజం తట్టే చేతులు
కరస్పర్శల కంటే కరెన్సీ స్పర్శల వాటం
గుండెకు తెలుస్తూనే ఉంటుంది.
నిజమో.. నిష్ఠూరమో
కలల కలవరింతల్లో జ్ఞానపీఠాలు
కళ్లు తెరిస్తే చాలు మళ్లీ కవిత్వ దాహం
గతకాలపు పీడల నీడల్ని వదిలించుకుంటూ
భవిష్య ప్రణాళికలో పడి
వర్తమానపు ఆలోచనలు
ఒళ్లు విరుచుకుంటాయ్.
మళ్లీ.. అగమ్య గోచరమే..
అజ్ఞాన దారులు మూసుకుంటూ
వాస్తవ వగలాడి
వచన రూపంలో కవ్విస్తూ ఉంటుంది.
రాయని భాస్కరుని కవి కిరణాలు
హృదయంలోకి ప్రసరిస్తుంటే
అక్షరాలను సమీకరించుకుంటూ
జీర్ణించుకోలేని మెదడు దిశగా
ధీమా దిక్సూచిగా సాగిపోతూ
కలం కదిలించే సవ్యసాచి!
*

-‘ధరణికోట’ శివరాంప్రసాద్.. 8019121081