Others

తల్లిదండ్రులకు ఇది.. పరీక్షా సమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండు- పదహారు ఏళ్ల వయసులో పిల్లలు మిడిల్ స్కూల్, హైస్కూల్‌లో చదువుతారు. ఇది వారి జీవితంలోనే కీలకమైన దశ. తల్లిదండ్రుల జోక్యాన్ని పిల్లలు సహించలేరు, అసహనం ప్రకటిస్తారు. శారీరకంగా ఎన్నో మార్పులు వస్తున్న దశలో విద్యార్థికి అనాజెస్ థింకింగ్, ఈక్వెన్షియల్ థింకింగ్ (ఒకదానితో ఒకటి జోడించటం) వంటివి ఏర్పడతాయి. రీజనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల మాటకన్నా స్నేహితుల మాటకు ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టే ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలకు కోపం రాకుండా, వారు ఆవేశపడకుండా పర్యవేక్షిస్తుండాలి. ఉరకలు వేసే వయసులో అంతులేని ఆవేశం ఉంటుంది. ఇదే దశలో పిల్లలకు ఆటల్లో ఆసక్తి కలిగించినట్టయితే- ఆ రంగంలోనూ వారు ప్రతిభ చూపిస్తారు. ఆటలాడే జట్టులో తమకు గుర్తింపు రావాలని పిల్లలు పరితపిస్తుంటారు.
ఇతర దేశాల్లోనైతే కోచ్‌లను ఏర్పాటు చేసి ఈత, పరుగు పందెం, ఇతర ఆటల్లో పిల్లలకు ప్రావీణ్యత నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మిడిల్ స్కూల్ కాబట్టి కొన్ని సున్నితమైన అంశాలు కూడా సబ్జెక్టులలో వస్తుంటాయి. లెక్కల్లో ట్రిగనామిట్రీ, ఫిజిక్స్‌లో నూటన్స్ లాస్, జాగ్రపీలో మ్యాప్ రీడింగ్ లాంటి విషయాల్లో బాలలు ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంది. చరిత్రను కథలాగా కాకుండా చూడాలి. చిన్నప్పుడు చరిత్రను వీరశివాజీ కథలాగా చదివేది కానీ, హైస్కూల్ దశలో విద్యార్థి ఆ చరిత్రను తన జీవితంలో పోల్చుకుంటాడు. సామాజిక భావాలు కూడా అంకురించే రోజులివి. ఈ దశలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా తమ అభిప్రాయాలను సలహాలుగా చెప్పాలి కానీ పిల్లలపై రుద్దకూడదు. ఈ దశలో క్యారెక్టర్ ఫార్మేషన్ జరుగుతుంది కనుక ప్రముఖుల జీవిత చరిత్రలు పిల్లల చేత చదివిస్తారు. ఇది అనుకరణ కాదు. దీనివల్ల పిల్లల్లో ‘స్ఫూర్తి’ భావాలు కలుగుతాయి. పిల్లల్లో క్యారెక్టర్ శక్తివంతంగా ఏర్పడుతుంది. సాంప్రదాయాలను సైతం వారు ప్రశ్నిస్తారు. పిల్లలకు సంబంధించిన ఈ దశ తల్లిదండ్రులకు పరీక్ష. ఈ దశలోనే వారు పిల్లలకు స్నేహితులుగా మారిపోతారు. అంటే పిల్లల దశ పండీ పండని కాయ దశ. అంటే- వదిలిపెట్టేటట్లు ఉండదు, పట్టుకునేటట్లుండదు. మనం చెప్పే నైతిక విలువలను కూడా వౌనంగా ఆలకించవచ్చు. లేక నిర్లిప్తంగా ఉండవచ్చు. ఆడపిల్లల విషయంలో తల్లి జాగ్రత్తగా సలహాలిస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రుల సహనానికే పరీక్ష. మిడిల్ స్కూల్ క్యారెక్టర్ ఫార్మేషన్ ప్రధాన ఘట్టం. పట్టుకొని నడిపించలేం, ఎత్తుకోలేం, చేయి పట్టుకుంటే పిల్లవాడు తీసేస్తాడు. పిల్లలు స్నేహితులను వదిలిపెట్టలేరు. ఇవన్నీ సందిగ్ధావస్థలు. తల్లిదండ్రుల నీడను వారు ఎక్కువగా భరించలేరు. అందుకే ఇది తల్లిదండ్రులకు పరీక్షా సమయం.
ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత..
సాధన, స్పందన, ప్రతిస్పందన ఉపాధ్యాయుల లక్ష్యసాధనకు మార్గాలు. పాఠం చెబుతున్నపుడు వారు ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. విద్యార్థులలో కల్పనాశక్తి (క్రియేటివిటీ)ని పెంచటానికి అదొక మార్గం. ఆ ఎత్తుగడే పాఠం. గత సంవత్సరం చెప్పిన పాఠమే చెబుతారు. అదే పాఠాన్ని కొత్త పద్ధతుల్లో చెబుతారు. అనగా ఉపాధ్యాయుడు స్వతహాగా కొత్త పంథాను, కొత్త ఎత్తుగడ వేస్తారు. అది అతని ఆలోచనల ఫలితం. దానే్న ప్రిపరేషన్ అంటాం. ఇన్ని ఏళ్లుగా ఆ పాఠమే చెబుతున్న ఉపాధ్యాయుడు మళ్లీ ఎందుకు దాన్ని కొత్తగా చదువుతాడని కొందరు అడుగుతారు. పాఠం పాతదే. దాన్ని కొత్త పద్ధతుల్లో ఎలా చెప్పాలో టీచర్లు ఆలోచిస్తారు. కొత్త ఎత్తుగడ వేయడంతో పాటు విద్యార్థుల్లో కాల్పనిక శక్తిని కూడా పెంచుతారు. అనగా పంతులు పాఠాన్ని ఇలా చెప్పిండు, దాన్ని మరో విధంగా చెప్పవచ్చు కదా? అని విద్యార్థి ఊహిస్తాడు. అదే పిల్లల్లో రగులుకోవాల్సిన కాల్పనికశక్తి. ఉపాధ్యాయునికి తన వృత్తి తన ఎదుగుదలకు, విద్యార్థుల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
ఉపాధ్యాయుడు విద్యార్థి వ్యక్తిత్వాన్ని పెంచుతాడు. తల్లిదండ్రులు పిల్లలకు జీవితాన్ని ఇస్తే ఉపాధ్యాయుడు క్యారెక్టర్ (శీలం)ను ఇస్తాడు. కొన్నిసార్లు తన నడవడికతో సరైన దారి చూపుతాడు. ఉపాధ్యాయుని జీవన విధానం ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులు దాన్ని అనుకరిస్తారు. అందుకే ఉపాధ్యాయుడికి దార్శనికత (విజనరీ) సంకల్ప శుద్ధి (మిషనరీ) కావాలి. పాఠం చెప్పటం ఎంత ప్రధానమో, తన జీవన విధానాన్ని, జీవితాన్ని రూపొందించుకోవటం కూడా అంతే ప్రధానం. ఉపాధ్యాయుని నిస్వార్థ జీవితం పిల్లలకు నాయకత్వపు లక్షణాలను అలవడేలా చేస్తుంది.
విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ తమ విద్యార్థులు నాయకులైతే గర్విస్తుంది. తమ దగ్గర చదువుకున్న పిల్లలు నాయకులైతే వారికి అధ్యాపకులు అభినందనలు చెప్పుకుంటారు. వాళ్లు తమ శిష్యులని గర్వంగా చెప్పుకుంటారు. ఇదే ఉపాధ్యాయునికి కానుకగా మారుతుంది. తమ విద్యార్థులు సమాజానికి చేసే సేవే తమ కానుకగా భావిస్తారు. ఉపాధ్యాయుడు చేసే పని ఒక వృత్తి కాదు. అది అంకిత భావానికి సంకేతం. అలాంటి జీవితాన్ని గత తరంలో గురువులు పాటించారు కాబట్టే వారు ఆదర్శ పురుషులు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాంటివారు ఆదర్శనీయులు. ఉపాధ్యాయ వృత్తి అలాంటి మహానుభావులను సృష్టిస్తే సమాజం కళకళలాడుతుంది. ఈనాటి ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత, నవసమాజ సృష్టికర్త.
ఉపాధ్యాయుడు చదివే పిల్లలంటే ఇష్టపడతాడు. కానీ చదవని పిల్లలు ఉపాధ్యాయులకు దూరమయ్యే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి పిల్లలను ఒక్కసారి పలకరిస్తే చాలు ఎంతో సంతోషపడతారు. దానిని అదునుగా తీసుకుని బాగుపడిన పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి పిల్లలపై ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించటంతో పాటు వారితో కూర్చుని, కుటుంబ ఇబ్బందులను తెలుసుకుంటే వారి జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వారికి ఏ విషయాలపై ఆసక్తి ఉంటే ఆ విషయాలనే ప్రస్తావనకు తీసుకువస్తే దానిని ఆసరా చేసుకుని అతని వైఖరిని, స్వభావాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక విద్యార్థి మారినా పాఠశాల లక్ష్యం పూర్తవుతుంది. చురుకైన పిల్లలు 10 మంది పిల్లలకన్నా ఒక ముభావ స్వభావం గల పిల్లవానిలో ఉపాధ్యాయుని శ్రద్ధ ఎంతో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది. అతనిలో కొద్ది మార్పు వచ్చినా దాన్ని ప్రశంసించాలి. 60 మార్కులు వచ్చిన విద్యార్థి కన్నా 20 మార్కులు వచ్చే విద్యార్థికి 25 మార్కులు వస్తే అది గొప్ప విజయం.

-చుక్కా రామయ్య