Others
ప్రతిరూపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రక్తం పంచుకొని పుట్టిన పేగుబంధం
మరొకరి గడపని సుసంపన్నం చేస్తూ మంచితనాన్ని
విస్తరిస్తే గుబాళించిన పరిమళం
దశదిశలా వ్యాపించింది
పుట్టక ముందే చచ్చిపోతున్న కాలంలో
అస్తిత్వ పుష్పమై మొలిచిన స్ఫూర్తికి
చేయెత్తి మొక్కాలి
అన్న కష్టం వెనుకున్న ప్రతి సందర్భంలో ఓదార్పు పవనమై
మనసుకు హాయినిచ్చే సోదర భావం
అడుగడుగునా కాళ్లకి
అల్లుకుపోతూ ఉంటుంది
నా దేశం పౌరులందరూ సహోదరులంటూ
ప్రతిజ్ఞలో వొదిగిపోయే అక్షరం
ఒంటరిగా తిరిగిన నాడే స్వాతంత్య్రం అన్న భావాన్ని
నిజం చేయాలని పోరాడుతూ
వోటమి ఎరుగని వనితాకుసుమాలు
అత్యాచార పర్వాలకి కలత చెందిన కళ్లతో
మృగాలపైనా దాడి చేస్తూ
ఆడపిల్ల ఎంత మాత్రమూ అబల కాదని
ఆత్మవిశ్వాసంతో దారం కట్టేస్తుంది
వసుధైక కుటుంబానికి పునాదులేస్తూ
ఆడపిల్ల ప్రపంచంలో దారమై అల్లుకుపోతున్న
గొప్ప బంధం
భూలోకంలో దేవుడు లేని లోటుని
అమ్మ చెల్లెళ్ల రూపంలో వచ్చి కుటుంబాన్ని
పరిపూర్ణం చేస్తుంది
ప్రతి అడుగులో తానుంటూ
రేపటి తరానికి తానూ కొవ్వొత్తిలా
కరిగిపోతున్న సోదరీలకు
మనస్ఫూర్తిగా రాఖీ శుభాకాంక్షలు.