Others

స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళల్లో క్రాంతిరేఖ.. విశ్వానికి స్ఫూర్తిదాత
విశ్వం ఆమె ఉనికి-
మన సేవలకి.. మానవతా విలువల పెంపుకి..
మదర్ థెరిస్సా మన మధ్యన లేరనేసరికి
కంటి ధర ఆగునా మింటిదాకా సాగక మానునా
అశ్రుతర్పణం.. ఆత్మ దర్పణం.. ఆమె కర్పణం-
ఆశ్రీతులకు అనాధలకు
రోగులకు వ్యాధులకు
రోగగ్రస్త పీడితులకు
దీర్ఘవ్యాధి బాధితులకు
ప్రేమభావం సేవాగుణం ఆమె సాధనం
ఆశ్రీతులకు అనాథలకు అభాగ్యులకు
ఆమే ఒక దివ్య వరం-
మరణంతో ఆగలేదు ఆ స్ఫూర్తి ఆ దీప్తి
ఎన్నటికి అదే స్వరం
ఆశ్రీత శ్రేయమే ఆ నినాదం
ఆ తేజం.. ఆ త్యాగం.. ఉద్వేగం.. ఉత్సాహం..
మనలో రావాలి.. మనమే తేవాలి..
అపుడే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి

-ఆచార్య క్రిష్ణోదయ 7416888505