Others

రక్షా బంధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ తర్వాత అమ్మవై, నాన్న తర్వాత నాన్నవై
నా చేయిని పట్టుకొని, నన్ను నీ హస్తాలతో ఎత్తుకొని
చీకటిదారులలో ముళ్ళబాటలలో నీవు నడిచి
నన్ను జలతారు పూలబాటలలో నడిపించుచున్న ఓ సోదరా!
నేను నీకు మనసా వాచా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
నా ప్రతి పుట్టిన రోజుకు నీ అమృత హృదయంలో చోటుతోపాటు
ఏదో ఒకటి కానుకగా ఇచ్చి నా శిరస్సును ప్రేమగా నిమిరి
అక్షింతలు వేసి, శతమానం భవతి అని నీ అపూర్వ ఆశీర్వాదాన్ని
నాకు అందించి, కష్టసుఖాలలో తోడూ నీడగా
నా చుట్టూ రక్షణా చక్రమై నిలుచున్న విష్ణుచక్రం లాంటి
నీ చేతులకు ఏమివ్వగలను?
జన్మజన్మలకు తీర్చుకోలేని
ఋణపడి వుండడం తప్ప.
శతాబ్దాల ఒరవడిలో కాలకన్య
పరుగిడినా, మేరువు
తలక్రిందులైనా,
విరిగిపోని, చెదరిపోని,
వొరిగిపోని మన బంధానికి
నే కడుతున్నా
వెలకట్టలేని రాఖీని.
అనంతమైన ఈ విశ్వంలో
సూర్యచంద్రులుండేవరకూ
మన అన్నాచెలెళ్ళ అనుబంధం యుగయుగాలు నిలవాలని,
ఆ భగవంతుని అనుగ్రహం నిరంతరం మనకుండాలని
తేనె బిందువులాంటి మధురమైన ఈ బంధం మన పాలిటి
ఒక వరమై, శుభప్రదమై మరపురాని అరుణోదయమై
ఇలలో ఒక సంగీతమై, ప్రవహించాలని ఆశిస్తూ..

-కాశినేని గీతాదేవి 9440230401