Others

ఎన్టీఆర్‌తో మరోసారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కొరటాల శివ తదుపరి చిత్రంగా మెగాస్టార్‌తో సినిమాకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల ఆ తరువాత ఒకదాన్ని మించి మరో సూపర్‌హిట్ సినిమాలు తెరకెక్కించాడు. తాజాగా మహేష్‌తో భరత్ అనే నేను తరువాత చిరంజీవి కోసం కథను సిద్ధం చేస్తున్న ఆయన, ఆ తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి సినిమా మళ్లీ ఎన్టీఆర్‌తోనే ఉంటుందట. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా కూడా నిలిచింది. ఇపుడు మళ్లీ వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. దానికోసం కూడా కొరటాల శివ లైన్ సిద్ధం చేశాడట. ఆ లైన్‌ను ఎన్టీఆర్‌కు వినిపించి ఓకె చెప్పించేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న అరవింద సమేత తరువాత రాజవౌళి దర్శకత్వంలో చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ చేయనున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల సినిమా ఉంటుందని సమాచారం.