Others

మళ్లీ బిజీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ గ్లామర్ గర్ల్ రెజీనా కాసాండ్రాకు ఈమధ్య టైం అస్సలు బాగోలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలు అందుకోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దాంతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మధ్యే చంద్రవౌళి అనే సినిమాలో కాస్త గ్లామర్ డోస్ ఓ రేంజ్‌లో పెంచేసి మళ్లీ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడికి ఆ ఆశలు ఫలించాయి. ఎందుకంటే ప్రస్తుతం రెజీనాకు కోలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా తమిళంలో అరవింద్‌స్వామి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో రెజీనాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దాంతోపాటు రాజపాండి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పింది. అయితే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోందట. దాంతోపాటు మరో రెండు సినిమాలకోసం చర్చలు జరుగుతున్నాయట. ఈ లెక్కన రెజీనా కోలీవుడ్‌లో మళ్లీ బిజీగా మారడం ఖాయమని అంటున్నాయి సినీవర్గాలు.

శ్రీనివాస్ ఆర్.రావ్