Others

చరిత్ర సాక్షిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేయ సంస్కృతి
హీన కృత్యాలు
నీ రంగస్థలిలో
నవరస నటనలు
ఆకాశదారుల వెంట
భూమార్గాల నిండా అదే నటన!
గాలి తలవంచుకు పోతూంది
నీరు నిశ్శబ్దంగా పారుతూంది
ప్రకృతి పెదవి కదపక నిలిచింది
చరిత్ర పుటలకెక్కుతూ ఉంది.
రేపు
గాలి పీల్చినవాడు
తలవంచిన గాలిని తలెత్తి ప్రశ్నిస్తాడు
నీరు తాగినవాడు
పారే నీటి నిశ్శబ్దంలో శబ్దం వింటాడు
ప్రకృతి చూసినవాడు
కదపని పెదవి విప్పమంటాడు
అధ్యాయాలపై అధ్యయనం చేసి
నిన్ను వెతుకుతూ తిరుగుతాడు!
నువ్వు దాగటానికి ప్రయత్నిస్తే
ఉత్తర దక్షిణ దిశల్లో గిరులుండవు
తూర్పు పడమర కొండల అధిపతి
చొరబాటు అడ్డుకుంటాడు
మేఘాల మాటున మాయమైతే
గగనవాణి నిన్ను పట్టిస్తుంది
జలస్తంభన విద్యనేర్చి
సముద్ర గర్భంలో పొంచితే
చెలియలికట్ట మాటు వేస్తుంది
నేల మాళిగల్లో దాగితే
భూమి ఆనవాళ్లు పసిగడుతుంది!
కంసుడి అకృత్యాలు
సంవత్సరాల పర్యంతం సాగాయి
వాసుదేవుడి సహనం
అందరికీ అసహనం పంచింది
అకృత్యాల పంట పండాక
కోత ముంచుకొచ్చింది
మరణ మృదంగం మోగింది.
*

-అడిగోపుల వెంకటరత్నమ్.. 9848252946