Others

భావాలు ఏర్పడే సమయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి విద్యార్థికీ పాఠశాల దశ ఎంతో కీలకమైనది. ఈ దశే విద్యార్థి భవిష్యత్ రూపురేఖలను సమకూర్చుతుంది. చి న్నప్పటి నుంచి మనిషి ఆలోచించేది ఒకే ఒక ప్రశ్న? ‘నేను నా జీవితంలో ఏం కావాలన్నదే’. దీనికి సమాధానం కోసమై వెతుకుతూ ఉంటారు. ఆ భావాలు ఎప్పటికీ ఒక మాదిరిగా ఉండవు. విద్యార్థి మానసిక పరిస్థితి మారినకొద్దీ అతని లక్ష్యం కూడా మారుతూ వుంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థికి మార్గదర్శకత్వం కల్పిస్తూ ఉండాలి.
పాఠశాల దశ- విద్యార్థులలో భావాలు ఏర్పడే సమయం. భావాల వలన ఆ విద్యార్థి మేధస్సులో కొన్ని నమూనాలు కూడా ఏర్పడుతాయి. కొన్నింటిని స్కూల్‌లోనే నేర్చుకుంటాడు. మరి కొన్నింటిని ఇతరుల సహవాసంలో నేర్చుకుంటాడు. అందుకే విద్యార్థి ‘విజన్’ వ్యక్తిగతమైనది కాదు. దీనిలో ఎంతోమంది పాల్గొంటున్నారు. విద్యార్థి భవిష్యత్ ఏ ఒక్కరితోనో నిర్మించబడేది కాదు. ఈ దశలో విద్యార్థికి కల్పించినటువంటి వనరులే ఆ పిల్లలను ప్రభావితం చేస్తుంటాయి. జీవితంలో ఎక్కడకు వెళ్లినా, ఏమి సాధించినా- ఏ స్కూల్లో చదువుకున్నావని అందరూ అడుగుతారు. భావాలు ఏర్పడమనేది కేజీ నుంచి ఆరంభవౌతుంది. ఏడిస్తే అమ్మ పరుగెత్తుకొస్తుందని తెలుసు. అన్నం తింటే ఆకలి వేయదని తెలుస్తుంది. 20 సంవత్సరాలు వచ్చేంతవరకు మనకు తెలియకుండానే విద్యార్థి శోధిస్తూనే ఉంటాడు. విద్యార్థిలో ఉండే రీజనింగ్‌కు, ఆలోచనా నైపుణ్యానికి స్కూళ్లలోనే పునాది ఏర్పడుతుంది. విద్యార్థి కాల్పనిక శక్తిలేక మానవ సంబంధాలకు ప్రాతిపదిక తరగతి గదే. పిల్లల్లో ఎన్నో రకాలైన ఆలోచనలుంటాయి. దాని గురించి మన పాత్ర ఏమిటో? అన్న దానిపై చర్చించాలి.
నా ముఖం అమ్మముఖం పోలికతో ఎందుకుంది? తన ముఖాన్ని అమ్మముఖంతో పోల్చుకుంటాడు. దానికి కారణం వెతుకుతాడు. దేనినైనా బద్దలు కొట్టాలంటే సుత్తినే ఎందుకు వాడతారు? స్క్రూ డ్రైవర్ చేసే పని ఏమిటి? ఈ పనులు ఎలాంటివో పోల్చుకుంటాడు. ఒకే పనిని ఎన్ని రకాలుగా చేయాలో విద్యార్థి ఆలోచిస్తాడు. ఇట్లాంటి రీజనింగ్‌ను ఎనాలజెస్ రీజినింగ్ అంటారు. ఒక దృశ్యంతో వచ్చిన ఆలోచనలను ఇతర దృశ్యాలతో వచ్చే ఆలోచనతో పోల్చుకుని వాటి సంబంధాలలో ఉండే సారూప్యతను గమనిస్తాడు. ఎనాలజెస్ థింకింగ్ అనగా ఉపాధ్యాయుడు ఒక లెక్కను చేస్తున్నప్పుడు ఆ పద్ధతిని గమనించి తను కూడా ఒక రీజనింగ్‌ను నిర్మించుకుంటాడు. దాన్ని సీక్వెన్షియల్ థింకింగ్ అంటాడు. చిన్నప్పుడు ఒక కొత్త వస్తువుచూస్తే అది కావాలని పిల్లవాడు ఏడుస్తాడు. తండ్రి దాన్ని మరిపిస్తాడు. కానీ కొన్నిరోజుల తర్వాత ఒక కథ చెబుతుంటే తెల్లవారి మరో కథను మరలా చెబుతున్నప్పుడు ఆ కథకు, ఈ కథకు సంబంధాన్ని జోడిస్తాడు. దానివల్లనే పిల్లలకు కథ బాగా అర్థమవుతుంది.
బడికి తండ్రి రాగానే తరగతి గది నుంచి పిల్లవాడు పరుగున వెళతాడు. ఇంట్లో ఉంటే పెంపుడు జంతువులను దగ్గరికి తీసుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఒక సంఘటనకు, మరో సంఘటనకు సంబంధాన్ని జోడిస్తాడు. ఇలాంటి సీక్వెన్షియల్ థింకింగ్‌ను యాధృచ్ఛికంగా చూడకూడదు. వీటిని గమనించి తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఈ థింకింగ్ అభివృద్ధి చేస్తాడు. పిల్లలు ఎదిగే కాలం లోపల వారిలో ఏ రీజనింగ్ ఎక్కువగా పెరుగుతోంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాల్నో అని ఆలోచించేవాడే టీచర్.

-చుక్కా రామయ్య