Others

ఈ వనిలో కోయిలనై.(నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ తరం కుర్రకారుకు పాత సినిమాల్లో పాటలు నచ్చవు. మసుకెక్కవు. సాహిత్య పిపాసులకు కొత్త పాటలు విరక్తి కల్గిస్తాయి. సాహిత్యాభిమానులకు పాత సినిమా పాటలు వీనుల విందుగా విన్పిస్తాయి. అది ఆనాటి రచయితల సాహిత్య మహిమ. గుణసుందరి కథలోని ‘ఈ వనిలో కోయిలనై...’ పాటంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ పాటను రచించే తీరు! టి.జి.కమలాదేవి నటిస్తూ, పాడిన ఈ పాటలో ప్రత్యేకత ఉంది. దీనికి సంగీతాన్నందించినవారు శ్రీ ఓగిరాల రామచంద్రరావుగారు. అద్భుతమైన సంగీతం ఆయనది! ఈ చిత్రానికి ప్రాణంపోశారు. ఈ పాటను ఓ దేవకన్య అభినయిస్తుంది. రాజుగారి బిడ్డలను వెదుక్కుంటూ అరణ్యంలోకి వస్తారు సైనికులు. వారిని ఏమార్చేందుకు దేవకన్య అరణ్యంలోని ఓ నందన వనంలో ఈ పాట పాడుతుంది. సైనికులు ఆమెను చూసి పరవశించిపోతారు. ఆ పరవశంలో తామెందుకొచ్చారో మరచి, ఆమె దగ్గరకి పోతారు. ఇదీ పాట సందర్భం. ఈ పాటను టి.జి.కమలాదేవి పాడుతుంది. పింగళిగారు రచయిత.
ఈ పాటను ముక్తిపదగ్రస్తాలంకారంలో వ్రాస్తారు రచయిత. అంటే ప్రతీ పంక్తి చివరి పదాన్ని తీసుకొని, తరువాత పంక్తిని ప్రారంభించడం. గమనించండి.
ఈ వనిలో కోయిలనై
కోయిల పాడే గానమునై
గానము కోరే చెవినై
నా చెవిలో నే ధ్వనిస్తా
* మింట చనే మేఘమునై
మేఘములోని చంచలనై
చంచల కోరే గురినై
నా గురిలో నే నటిస్తా!
టి.జి.కమలాదేవి అభినయం బాగుంటుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. గుణసుందరి కథ (1949)లో విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.

- మల్లారెడ్డి రామకృష్ణ, శ్రీకాకుళం