Others

నో గ్లామర్ రోల్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటి షాక్ అవుతున్నారా.. ఇన్ని రోజులు తనదైన గ్లామర్‌తో ఘాటు లిప్‌లాక్ సన్నివేశాలతో ఆకట్టుకున్న ఆండ్రియా ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేయనని అంటుంది. ఏంటి ఆండ్రియా ఇలాంటి నిర్ణయం తీసుకుందని షాక్ అవ్వకండి.. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఇకపై గ్లామర్ రోల్స్, లిప్‌లాక్ సీన్స్ చేసేదిలేదని, కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆండ్రియా తాజాగా కమల్‌హాసన్ సరసన విశ్వరూపం-2లో నటించింది. దాంతోపాటు లారెన్స్ కాంచన సినిమాలో కూడా నటించి మంచి పేరుతెచ్చుకుంది. అటు కుర్ర హీరోలు, ఇటు సీనియర్ హీరోలతో నటించిన ఆండ్రియా నిర్ణయం వెనక కారణాలు ఏమిటో మరి!?

--శ్రీనివాస్ ఆర్.రావ్