Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచమంతా ఒకే ఒక మూల పదార్థంలోనుంచి ఆవిర్భవిస్తోందని భారతీయ వేదాంత భావన చెబుతోంది. ఉదాహరణకు, ముండకోపనిషత్తులో శిష్యుడు గురువును యిలా ప్రశ్నిస్తాడు. ‘కస్మిన్ ను భగవన్ విజ్ఞాతే- సర్వం ఇదం విజ్ఞాతం భవతి’’అని. అంటే ‘‘ఓ గురుదేవా! ఏ ఒక్కదాన్ని తెలుసుకొంటే సమస్తమూ తెలుసుకోబడుతుందో, దానిని నాకు తెలుపవలసింది’’-అని భావం. ఆ ఉపనిషత్తులో చాలా చర్చ జరుగుతుంది. చివరకు గురువు యిలా చెపుతాడు. ‘‘ఈ భూమి, భూమిని మించి కనిపించే విశాల విశ్వమూ, మానవుని హృదయంలో భాసించే మానసిక ప్రపంచమూ, మనస్సు, ప్రాణము యిలాంటివన్నీ కూడా ఒకదానితోఒకటి అవిభాజ్యంగా పెనవేసుకొని వున్నాయి. ఇవన్నీ కలిసి ఒక తత్వంలోంచి ఆవిర్భవిస్తున్నాయి. దాని పేరే ఆత్మలేక బ్రహ్మ.’’
ఇది ఉపనిషద్బోధ. ఏకత్వంలోంచి బహుత్వం. బహుత్వంలో అంతస్సూత్రంగా ఏకత్వం. ఇది వేదాల సారం.
విజ్ఞాన దృష్టి:
పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి న్యూటన్ యుగాన్ని ఇంచుమించు ప్రారంభ యుగంగా భావించవచ్చు. అప్పటినుంచి ఇటీవల కాలందాకా విజ్ఞానశాస్తమ్రు యొక్క భావన వేదాంతానికి విరుద్ధంగానే వుంటూ వచ్చింది. విజ్ఞానశాస్త్ర భావనలో ఒక పదార్థము, మరొక పదార్థము వేరు. ఒక మనస్సు, మరొక మనస్సు వేరు. పదార్థము, మనస్సు వేరు. ఇలా అన్నీ వేరే. ఉదాహరణకు మీరీ కాగితం చదువుతున్నారు. చదివే మీరు వేరు, కాగితం వేరు, కాగితం మీద సిరా అక్షరాలున్నాయి. కాగితం వేరు, సిరా వేరు. ఇలా మొత్తమంతా భేదమే. దీని పేరే ద్వైతము. న్యూటన్ రుూ ద్వైతాన్ని ప్రపంచంలోనూ, జీవితంలోనూ కూడా సత్యమని నమ్మాడు. ఈ భావనకే క్రమంగా ‘‘కార్టేషియన్ ద్వేతము’’ అనే పేరు యేర్పడ్డది. ఈ భావన మూలస్తంభంగానే 19వ శతాబ్దంనాటి విజ్ఞానశాస్త్రం కొనసాగింది. 1905లో మొదటిసారిగా రుూ భావనకు, ఒక భూకంపం ఎదురైంది. జ్యూరిచ్ పాలిటెక్నిక్‌నుంచి వచ్చిన 21 ఏళ్ళ యువకుడు ఒక వ్యాసం ప్రకటించాడు. దాని పేరు ‘‘కదిలే పదార్థాల ఎలక్ట్రోడైనమిక్స్’’. యువకుని పేరు ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్. ఈ వ్యాసంలో రుూ కుర్రవాడు ఘన పదార్థంగా కనిపించే ద్రవ్యం నిజానికి ఏదో ఒక శక్తిస్వరూపమేనని, అంతమాత్రమేకాక ఆ పదార్థాల్ని, ఏదోఒక శక్తి రూపంలోకి పరివర్తన చెందించడం సాధ్యమేనని నిరూపించాడు. కేవలం సిద్ధాంతం చెప్పడమేకాక ఉ=ష2 అనే సుప్రసిద్ధ సూత్రాన్ని ఆయన కనుగొన్నాడు.
ఇవాళ న్యూక్లియర్ శక్తి కార్యక్రమాలన్నీ రుూ సూత్రం ఆధారంగానే జరుగుతున్నాయి. ఒక యురేనియం అణువును తీసికొని దానిలోని అణుభాగాలను ఫిషన్ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేసినప్పుడు, ఆ అణువులోని కొంత ద్రవ్యభాగం విధ్వంసమై శక్తిరూపంగా పరిణామం చెందుతోంది. అంటే అణురియాక్టర్ల రూపంలో పదార్థము-శక్తుల యొక్క పరివర్తనను మనం ప్రత్యక్షంగా చూస్తున్నామన్న మాట.
ఈ ఆవిష్కరణతో న్యూటన్ కాలంనుంచీ వస్తువు ద్వైత సిద్ధాంతానికి వైజ్ఞానికంగా పెద్దదెబ్బ తగిలింది. పదార్థానికి, శక్తికి మధ్యగల సరిహద్దురేఖ చెరిగిపోసాగింది.
అనిశ్చిత వాదము:
ఇది జరిగిన ఇరవై సంవత్సరాలు దాటినాక 1927లో ద్వైత భావనకు మరో పెద్ద భూకంపం సంభవించింది. మళ్ళీ మరొక 21 ఏళ్ళ యువకుడు హైసన్‌బర్గ్ ఈ భూకంపాన్ని కలిగించాడు. ఇతను ఒకసారి ‘‘హైనీ’’ పర్వతాలమీద వాహ్యాళికి వెళుతూ, ఎలక్ట్రానుల గతి స్వభావాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వుండగా అనుకోకుండా ఒక నూతన ఆలోచన మెరిసింది. దాని ఫలితమే ‘అనిశ్చిత వాదము’. ఇది నోబుల్ బహుమతిని గెలుచుకున్నది. ఇది ఆధునాతన విజ్ఞానశాస్త్రంలో ఒక విప్లవంగా భావింపబడింది.
ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఏమంటే-
ఒక అణురియాక్టరు వుందనుకోండి. దీనిలో న్యూట్రాన్స్ అనబడే అణు అవయవాల ద్వారా న్యూక్లియర్ రియాక్షన్‌ను తయారుచేస్తారు. ఇందులో ఒక అణువును న్యూట్రాన్‌ల కిరణంతో భేదిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, ఒక నిర్దిష్ట సమయంలో ఆ న్యూట్రాన్ కిరణంలోని ఖండాలను లెక్కించవచ్చు. ఆ ఖండాల సంఖ్య స్థిరంగావుంటే ఆ రియాక్టరు స్థిరంగా పనిచేస్తుందని చెపుతారు. అంటే ఇక్కడ నూట్రాన్స్‌ను అతి సన్ననైన ఘనపదార్థ రేణువులుగా లెక్కించడం సాధ్యమవుతోందన్నమాట. అంటే న్యూట్రాన్స్ అనేవి అణుఖండాలే అని నిశ్చయం అవుతోందన్నమాట.
దీనికి భిన్నంగా పైన చెప్పిన న్యూట్రాన్స్ కిరణాన్ని ఒక గాజు కటకంలోకి పంపామనుకోండి. అప్పుడు రిఫ్రాక్షన్ పాటరన్ (పరావర్తనము) ఏర్పడుతుంది. అంటే నిశ్చయంగా న్యూట్రాన్ కిరణం తరంగం లాగా వ్యవహరిస్తుందన్నమాట. న్యూట్రాన్ కిరణంలో తరంగ లక్షణం లేకపోయినట్లైతే, కేవలం అణుఖండాలే వుండి వున్నట్లైతే ఈ పరావర్తన నమూనా ఏర్పడే సావకాశం లేదు.
ఈ విధంగానే కాంతి కిరణాలు అనేక సందర్భాలలో అణుఖండాలుగాను, మరికొన్ని సందర్భాలలో తరంగాలుగానూ వ్యవహరించటం మనకు కనిపిస్తూ వుంటుంది. కాంతి కిరణాలలోని అణు ఖండాలవంటి పదార్థాలనే ఈనాడు ఫోటాన్స్ అని వ్యవహరిస్తున్నారు.
నిజానికి ఈ ఫోటాన్స్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది కూడా ఐన్‌స్టీనే. దీనికే ఆయనకు నోబుల్ బహుమతి వచ్చింది.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి