Others

దాగుడుమూతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ నిశీధి వేళలో...
జ్ఞాపకాల తీరాన
ఆశా నిరాశల పడగ నీడలో
కొట్టుమిట్టాడే సమయాన...
మనో క్రీడాంగణంపై
గత స్మృతుల దొంతరలు
దాగుడుమూతలాడసాగాయ!
ఇంకేముంది? మనసు...
ఎంచక్కా బ్రతుకు పుస్తకంలోని
ఒక్కో పేజీ తిరగేస్తూ...
కొమ్మకొమ్మపై
వాలిన పిట్టలు కాసేపటికే
ఎగిరిపోయనట్లు...
సమస్యలు సైతం
చుట్టాల వోలె పరామర్శించి
వెళ్తాయని విడమరచి చెప్పింది!
రాత్రి పిదప పగలొచ్చినట్లు
శశిని కమ్మిన మేఘాలు
కలకాలం వుండనట్లు
కష్టాలు సైతం
సుఖాలకు చోటిచ్చి తప్పుకుంటాయని
గుట్టు విప్పింది!
జీవితమనే సాగరంలో
సుడిగుండాలు... ఆటుపోట్లే కాదు...
ముత్యపు చిప్పలూ
ఉంటాయని వివరించింది!
హృదయ సీమలో
నిస్పృహకు తావివ్వక...
ఆలోచనాకాశాన్ని
తళుకులీనే నక్షత్రాలతో...
నింపుకొమ్మని హితవు పలికింది!

- దాస్యం సేనాధిపతి, 9440525544