Others

కనువిందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుతురాగానికి పరవశించిన
చెరువు
హరివిల్లు రంగుల
రవిక తొడిగి
రైతురాజు నేసిన
ఆకుపచ్చ చీరకట్టింది..
అల్లంత దూరాన
గగనతలములో పక్షుల గుంపొకటి
రెక్కలను టపటపలాడిస్తూ
పరేడ్ ప్రదర్శన
విహంగాల కనువిందు
ఆకాశమార్గాన..
కొండా కోనలుగా
హొయలుబోతున్న
జలపాత సిరులకు
కాంతికిరణాలు
ముచ్చటపడితే
మేఘాలపై విరసిన ఇంద్రచాపము
అడవిని చుట్టేసింది..
సంద్రము
ఆత్మీయుల రాకతో
కెరటాలై ఎగిసిపడి
ఉరుకులు పరుగులుగా
కాళ్లను చుట్టేసాయి..
సెలవిక అంటుంటే
ఎంతకోపమో అలిగి
వెనుకకు..
కనుచూపుమేరలో
గోదారమ్మపై..
ప్రేమజంట పడవపాట
నీళాల కన్నుల్లో చంద్రమే..
నెలవంక..
హొయిలెస్స హొయిలెస్స..
అటు అంబరాన
మినుగురు పురుగుల
కాంతులుగా..
తళుకులీనుతున్న
నక్షత్రాల..
కాంతి పరావర్తన సూత్రంగా
రేతిరిరేడు..
నిండు జాబిలై
అమృత బిందువులు
కురిపిస్తుంటే
భూభ్రమణ సిద్ధాంతంగా
సజీవత్వాన్ని
ఆపాదించుకున్న రేయి
రేపటి పొద్దుపొడుపుపై..

-మడిపల్లి హరిహరనాథ్ నిర్మల్ 96035 77655