Others

ఉత్తరాల తోటలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు కండువాల కాలంలో
మండువా లోగిలిలో
ఓ మారుమూల మానవీయత మారుగా
పొగచూరి పోయి ప్రేమ మీరిపోయి
చూరుకు వేలాడుతూ
చూపుకందని - రస
హృదయ స్పందనకు
ప్రాతినిధ్యం వహిస్తూ
చూడవీలుకాని - సహజ
ప్రేమామృత భావనకు
ప్రాణవాయువు నందిస్తూ...
ఉభయకుశలోపరి - తదుపరి
క్షేమ సమాచారంతో
ఊపిరిపోసుకున్న
ఉత్తరాల తోటలో-
విరబూసిన నవ్వు పువ్వులు
వెదజల్లిన స్నేహ పరిమళాలు
చేరవేసిన చేదు నిజాలు
ఊరడించిన ఓదార్పు స్వాంతనలు
మోసుకొచ్చిన గాలి కబుర్లు
పూసగుచ్చిన ఊసుల శ్వాసలు
ఏవి? ఎక్కడా జాడకైనా కానరావే
ఎంత వెతికినా తోడుగా మన చెంతలేవే!
మనసు కిటికీలు మూసుకుపోయి
గుండె గవాక్షాలు - గురుతు పట్టలేని
లౌఖ్య లోకాలకు పారిపోయి
లేఖా సాహిత్యం ఇంకిపోయింది
యాంత్రికమై పోతూన్న సహ
జీవనాకాశపు ఇసుక ఎడారుల్లో
యంత్రాలై బతుకుతూన్న
మానవాకారపు ఇనుప గుండెల్లో!
నువ్వే చెప్పు కాలమా?
నీకీ మార్పు న్యాయమా?
ఆధునికత - ఆత్మీయతను చెరిపేయాలా?
ఆధునికత - అంతరాత్మ పీక నులిమేయాలా?
పాల కోసం పరుగు పెడుతూన్న మనసులేని
మానవ యంత్రాలు
జాలిలేక మరుగున పడుతూన్న వౌనమైన
మానవ సంబంధాలు-
ఇంకెక్కడి ఉత్తరాల తోట?
ఇక - ఇక్కడ అది ఉత్తుత్తి మాట!!

-మరువాడ భానుమూర్తి 8008567895