AADIVAVRAM - Others

శ్రీవిఘ్న రాజం భజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ సంప్రదాయంలో ఒక ప్రతిష్ఠాత్మక, ప్రత్యేక పీఠాన్ని అలంకరించిన దేవుడు వినాయకుడు. సమస్త భారతదేశ ప్రజ వైభవంగా జరుపుకొనే పర్వదినం వినాయక చవితి పండుగ. గణాధిపతియైన గణపతి ప్రజల నిత్య జీవితంలో ఒక విడదీయరాని విభాగమై పోయాడు.
భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజు, విఘ్నేశ్వరుడు జన్మించడం, ఆయనకు ఆ రోజే విఘ్నాధిపత్యాన్ని ప్రసాదించడం జరిగింది. వినాయకుని చరిత్రంలోని విశేషాలు వినసొంపుగా ఉంటాయి. విన్నవారికి భక్తి ప్రపత్తుల నిస్తాయి.
శ్లో.విఘ్నాంధకార సూర్యాయ
మహాదేవాయతే నమః’ అని ఏ పనికైనా తొలుతగా విఘ్నేశ్వరుని ధ్యానించుట హిందూ సంప్రదాయం.
వినాయకుడంటే ‘విగతోనాయకః వినాయక’ అని శాస్త్ర వచనం. అనగా నాయకుడే లేని సర్వ స్వతంత్రుడు. సార్వభౌముడని అర్థం. ప్రథమ గణాలకే కాక మానవ దేహంలోని మూలాధార స్థానానికి అధిపతి కూడా గణపతే.
సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆజ్ఞపై మహాభారత రచనలో వేదవ్యాస మహర్షి చెబుతుండగా దానికి అక్షర రూపం కల్పించినవాడు ఈ గణపతియే. అనాదిగా అసుర శక్తుల వలన కలిగే విఘ్నాలను నివారించడానికి, సృష్టి ఆరంభంలో అవతరించి బ్రహ్మకు సాయం చేసినట్లు వేద ప్రమాణం. పౌరాణిక మంత్రాల ద్వారా శైవ - వైష్ణవ విభిన్న రీతుల ద్వారా భారతీయులు - విదేశీయులు గణపతిని పూజిస్తున్నారు.
ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితినాడు బంగారంతో గానీ, వెండితోగానీ, మట్టితోగాని గణపతి ప్రతిమను చేయించి భక్తి శ్రద్ధలతో పూజించాలని భవిష్య పురాణోక్తి.
స్కంద పురాణంలో గణపతి గజముఖుడుగా జన్మించినట్లున్నది. శివపురాణంలో పురుషాకారంగా జన్మించినట్లు తెలుస్తుంది. గజముఖానికి కారణం పరమశివుడు గజపతి శిరస్సును ఖండించాడని అందరికీ తెలిసిన సంగతి. బ్రహ్మ వైవర్త పురాణంలో కశ్యపుని శాపకారణంగా గణపతి శిరస్సు వక్కలైనట్లు పేర్కొంది. దేవతలు ఋషులు శివుని ప్రార్థించగా శివుడు ఆలోచిస్తూ నిమగ్నమైనాడు. ఆకాశంలోకి చూశాడు. గగనుడు గమనించి మానవ రూపంలో శివుడి ముందు ప్రత్యక్షమై, చంద్రుని పట్టి అమృతంలో కలిపి ఒక అందమైన రూపాన్ని నిర్మించి ఇచ్చాడట. ఆ అద్భుత అందమైన రూపాన్ని చూసి దేవతలు కామించారనీ, శివుడు ఆగ్రహించి శపించగా, పెద్దబొజ్జ, ఏనుగు తలతో వికృత రూపంగా మారినట్లు వేరొక కథ. బ్రహ్మవైవర్త పురాణం గణపతిని శ్రీకృష్ణుని అంశగా వివరించినది.
పంచముఖునిగా, దశభుజునిగానున్న గణపతికి 21 రకాల పత్రాలు ఇష్టంగాన, వీటితో అందరూ పూజించాలని చరిత్ర తెలిపింది. ఒక్కో మంత్రాన్ని స్మరిస్తూ ఒక్కో విధమైన పత్రాన్ని పుష్పాన్ని అర్పించడం సంప్రదాయమైనది. నైవేద్యంగా కుడుములు నివేదిస్తారు. సమస్త ఓషధులకూ, వాటి శక్తులకూ ఓషధీపతిగా గణపతిని పూజిస్తారు. గణపతి సహస్ర నామాలలో ‘ఓం ఓషధీపతయే నమః’ అనేది ఒక మంత్రం. ఇరవై ఒక్క రకాల విభిన్న ఓషధీ వర్గ పత్రాలతో గణనాథుని పూజిస్తారు.
ఒకే పరబ్రహ్మను పలు రకాలుగా ఉపాసించి, ఆరాధించే విధానాలన్నీ వేదాలలో తెలుపబడినాయి. ఆ రీతిగా ఆ బ్రహ్మను, విఘ్న హంతగా, గణాల నాయకునిగా తెల్పుతూ ‘గణపతి’ న్నారు. వాఙ్మయంలో ‘కలే చండీ వినాయకౌ’ అని. కలికాలంలో దుర్గ, గణపతుల గద్యః ప్రసన్నాం’ అని వెంకటనే అనుగ్రహించే దేవతలు అని చెప్పబడినది. సృష్ట్యాదిలో సృష్టికి ఏర్పడిన విఘ్నాలను పోగొట్టేందుకు బ్రహ్మ ధ్యాన నిమగ్నుడైన వేళ ఆ పరబ్రహ్మ ఓంకార స్వరూపుడుగా, వక్రతుండునిగా గోచరించి - విఘ్నాలను తొలగించినాడు. ఇదియే గణపతి ప్రథమ సాక్షాత్కారము.
పిదప శివపార్వతులకు తనయునిగా మరొక అవతారం. గణం అంటే సమూహం. విశ్వమంతా గణమయం. పలు గణాలతో ఈ మహాగణం - ఈ విశ్వం - మనుష్య గణం - వృక్ష - గ్రహ గణాలు అన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమేశ్వరుడు గణపతి. దేశం అన్ని ప్రాంతాలలో గణపతి ఉపాసన వ్యాప్తి చెందినది. పంచమతాలలో గాణాపత్యం ఒకటి. మిగిలినవి సూర్య వైష్ణవ శైవ శాక్తేయని ఖ్యాతి.
శ్లో.శివే విష్ణే చ శక్తే చ - సూర్యమయినరాధిప
యా అభేద బుద్ధిర్యోగఢ - సమ్యగ్యో గోమతోమమ
ఈ ఐదుగురిని అభేద దృష్టితో చూడడం సమ్యోగం అంటారు. సమస్త విశ్వానికి ఆధార శక్తి గణపతి, అని గణేశ గీత.

-సీత