Others

గర్భధారణతో గుండె నిండా సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృత్వం ప్రతి స్ర్తికి గొప్ప వరం. గర్భవతి అయిన తరువాత స్ర్తి ఆనందానికి లోటుండదు. తాను గర్భవతిని అయ్యానని తెలిసిన వెంటనే ఆమె సంతోషం, ఆనందం ముందు అన్నీ దిగతుడుపుగానే ఉంటాయి. ఆ క్షణం నుంచీ ఆమె భర్త, అత్తింటివారు, పుట్టింటివారు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో కొందరి విషయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆనందంతో ఒక్కోసారి ఒత్తిడికి లోనవుతారు. ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తి, ఆ ప్రభావం కడుపులోని బిడ్డపైన కూడా పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? తల్లి కాబోతున్న స్ర్తిలు ఆ సమయంలో ఎలా వుండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి చూద్దామా...
గర్భంతో వున్న స్ర్తి ఎలాంటి మానసిక ఒత్తిడులకు లోనుకాకూడదు. మానసిక ఒత్తిడులకు లోనైన స్ర్తిలలో కోపం, చిరాకు, దిగులుగా కనబడటం, కారణం లేకుండానే కన్నీళ్ళు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భవతిగా వున్న సమయంలో వచ్చే ఒత్తిడిని పెరినాటల్ డిప్రెషన్ అంటారు. సంతోషం లేకపోవటం, బాగా అలసిపోవటం ఆత్మీయులైనవారికి దూరంగా ఉండడం, అందరితో గొడవపడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
గర్భవతి అయిన స్ర్తి శరీరం క్రమంగా వివిధ రకాలుగా మార్పు చెందుతూ వస్తుంది. దానితోపాటు శరీరంలో పలు రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఆ సమయంలో గర్భవతి ఏదైనా సమస్య, ఇబ్బంది గురించి ఆలోచిస్తే, అది వారి మనసుపైనే కాక శరీరంపైన కూడా ప్రభావం చూపించే అవకాశం వుంది. ఈ కారణంగా వీరు ఆందోళనకు గురవుతారు. గర్భవతిగా వున్నప్పుడు శరీరంలోకి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అని రెండు రకాల హార్మోన్లు విడుదలవుతాయి. స్ర్తి బిడ్డకు జన్మ ఇచ్చిన 24 గంటల సమయానికి ఈ హార్మోన్ల విడుదల అధికమవుతుంది. ఈ హార్మోన్ల వలన ఒత్తిడి వస్తుంది. దీనితోపాటు థైరాయిడ్ అనే హార్మోన్ కూడా ఒత్తిడికి కారణమవుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి మెడ దగ్గర ఉంటుంది. ఇది తల్లి తినే ఆహారాన్ని సరైన క్రమంలో ఆహార వాహికకు పంపించే ప్రక్రియలో పాల్గొంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథివల్ల విడుదలయ్యే హార్మోన్ల ద్వారా గర్భంలో వున్న స్ర్తి ఒత్తిడికి దారితీయవచ్చు.
కాన్పు అయిన తరువాత కూడా కొందరు స్ర్తిలలో ఈ విధమైన మానసిక సమస్యలు వచ్చే అవకాశం వుంది.
- కాన్పు అయిన తరువాత తాను ఏదో కోల్పోయాననన్న బాధ, తన అందం తరిగిపోతుందన్న బాధ.
- పని చేసుకోలేక చిన్న చిన్న విషయాలకు చిరాకు, కోపం రావటం, ఎదుటివారితో వాగ్వివాదాలు.
మానసిక అశాంతి, సంతోషంగా ఉండలేకపోవటం, జీవితంలో ఏదో కోల్పోయానన్న బాధ, ఆహారం రుచించకపోవటం, ఆకలి సరిగా లేకపోవటం, ప్రతి చిన్న విషయానికీ చిరాకుపడటం వంటివి ఒత్తిడికి సంకేతాలుగా అనుకోవచ్చు.
గర్భవతిగా వున్న స్ర్తి మానసిక ఒత్తిడికి గురైతే అది తల్లికే కాదు, కడుపులోని బిడ్డకు కూడా నష్టం జరిగే అవకాశం వుంది. ఇలా ఒత్తిడి సమస్యతో ఉన్నవారు ఆహారం సరిగా తీసుకోకపోవటంవల్ల కాన్పు సమయంలో ఇబ్బంది పడతారు. ఫలితంగా నెలలు నిండక మునుపే ప్రసవం కావటం వంటివి జరిగే అవకాశం వుంది.
ఒకవేళ ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే వెంటనే నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భవతిగా వున్న సమయంలో పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తూ ముందుకు సాగాలి. శారీరకంగా, మానసికంగా అలసిపోకూడదు. ఒత్తిడులకు లోనుకాకూడదు. హాయిగా, ఆనందంగా, సంతోషంగా వుంటే మంచిది. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి.

-మనస్విని