Others

శింబు సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత రోజుల్లో సినిమాల్లో అవకాశాలు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. దానితోపాటు నటనతో మెప్పించే ఆకర్షణ ఉండాలి. లై సినిమాతో గత ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. చూడగానే తన నవ్వుతో కుర్రకారు మనస్సు దోచుకున్న ఈ బ్యూటీ అనుకున్నంత రేంజ్‌లో హిట్ అందుకోలేదు. ఇక రెండవ సినిమా ఛల్ మోహనరంగా కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈ అమ్మడిని తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదని తమిళ్‌లో ట్రై చెయ్యగానే అధర్వతో ఒక అవకాశం దక్కింది. ఇక అదృష్టం బావుండి మరో మంచి కథలో అవకాశం దక్కించుకుందట. పవన్‌కళ్యాణ్‌కు బాక్సాపీస్ హిట్ అందించిన అత్తారింటికి దారేది సినిమాను తమిళ్‌లో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో మేఘా ఆకాష్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ అవకాశంతో అయినా ఈ బ్యూటీ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంటుందో లేదో చూడాలి!

చిత్రం ..మేఘా ఆకాష్