Others

బాలీవుడ్‌లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఈమధ్యకాలంలో ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తాడంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈమధ్య బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల హవా ఓ రేంజ్‌లో వుంది. ఇప్పటికే పలువురి ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇండియాకు క్రికెట్‌లో వరల్డ్‌కప్‌ని సాధించిపెట్టిన కెప్టెన్ కపిల్‌దేవ్ జీవిత కథతో తెరకెక్కే చిత్రంలో అల్లు అర్జున్ కీలక పాత్ర పోషిస్తాడట. కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ నటించనున్నారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ డాషింగ్ ఓపెనర్ శ్రీకాంత్ పాత్ర పోషిస్తాడట. ఇప్పటికే దీనికి సంబంధించి అల్లు అర్జున్‌తో దర్శకుడు కబీర్‌ఖాన్ చర్చలు జరుపుతున్నాడు. 83 టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్‌గా ఇండియాకు వరల్డ్‌కప్ సాధించాడు. ఈ టీమ్‌లో మరో కీ రోల్ పోషించిన కృష్ణమాచార్య శ్రీకాంత్ పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడు. తాజాగా నా పేరు సూర్య సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ, తన తదుపరి చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కె కుమార్‌తో చేస్తున్నాడు.

శ్రీనివాస్ ఆర్.రావ్