Others

అగజానన పద్మ దివాకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుపమ భక్తితోడ అగజానన పద్మ దివాకరా! గజా
నన! సురవంద్య! అందరు ఘనంబగు భాద్రపదాన సిద్ధి బు
ద్ధిని బడయంగ పత్రినిడి దివ్య చతుర్థిని నీకుదాత్త పూ
జను నొనరింతురీ భరత జాతి సమైక్య ఫల ప్రతీకగా
కులగోత్రాదికభేద భావములకున్ కోటానుకోట్లైన మ్రొ
క్కులకున్ బంగరువైన పల్కులకు నే కొంచెంపు చోటేనియున్
గలుగన్ నేరదుగాదె! నీదగు మహానందార్చపీఠాన ఆ
కులపాటొందని భక్తి భావము వినా - కొండాట కర్హుండవే
భారత కావ్యగీతికి విభాసుర రీతిగ చుట్టినావు శ్రీ
కారము వ్యాసకీర్తి కలకాలము నిల్వగ; తప్పులున్న మా
భారత జీవకావ్యమును బాగొనరింపగ క్రొత్తవౌ అలం
కారములెన్నో గూర్పర! జగాన బిరాన అనుగ్రహింపరా

-రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287