Others

ఈనాడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ కృష...్ణ తెలుగు సినీ ప్రపంచంలో ఆయనో సాహసం! ఏది చెయ్యాలన్నా ఆయనవల్లే సాధ్యం. కేవలం తొమ్మిది సంవత్సరాల కాలంలోనే ‘అల్లూరి సీతారామరాజు’తో వంద సినిమాలు పూర్తిచేసుకొని, రెండువందల సినిమాల టార్గెట్‌గా ముందుకు దూసుకువెళ్ళాడు. సినిమాలు రిలీజవుతున్నాయి. 1982 డిసెంబర్ వచ్చేసింది. కృష్ణ రెండువందల చిత్రంగా ఈనాడు రిలీజవుతుందన్న వార్త పత్రికల్లో వచ్చింది. అభిమానుల ఉత్సాహం! ఆ సినిమా ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందని కృష్ణ ముందే తెలిపారు. అంతకుముందు మలయాళంలో ‘ఈనాడ్’ రిలీజైంది. కృష్ణ చూసి, నచ్చి పరుచూరిబ్రదర్స్‌కు స్క్రిప్ట్‌వర్క్ చేయమని పురమాయించారు. తన రెండువందల చిత్రంగా ఈనాడు అని ప్రకటించేసారు. అందరికీ ఆశ్చర్యం! ఎందుకంటే అదో పొలిటికల్ డ్రామా! జనాలకు నచ్చుతుందో? లేదో? అయినా కృష్ణ వెరవలేదు. షూటింగ్ ప్రారంభమయ్యింది. శరవేగంగా పూర్తయింది. పి.సాంబశివరావు దర్శకత్వంలో 17 డిసెంబర్ 1982న స్క్రీన్‌పై ప్రదర్శించబడింది.
సంచలనం! హీరోయిన్ లేదు. డ్యూయెట్స్ లేవు. కృష్ణకు రంగురంగుల దుస్తులు లేవు. అయినా ఘనవిజయం. డైలాగ్స్ పదునుగా ఉన్నాయి. ఆనాటి సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టిందీసినిమా! కల్తీసారా వ్యాపారస్తుల ఆగడాలు, వాళ్ళకు కోర్టులు ఏంటిసిపేటరీ బెయిల్ మంజూరుచెయ్యడం, వాళ్ళకు మంత్రులు అండగా ఉండటం, లైఫ్ సర్ట్ఫికేట్ తెమ్మని ఉద్యోగస్తులు వృద్ధులను వేధించడం, నిజాయితీగా ఉన్న పోలీస్ అధికారి శ్రీ్ధర్‌పై పైఅధికారులు అతని నిజాయితీని ప్రశ్నించడం, అతను లంచగొండుగా మారితే వాళ్ళు ఆశ్చర్యపోవడం, కాలేజి అమ్మాయి రేప్ కేసులో అబ్బాయికి శిక్ష పడకపోవడం, కల్తీసారా తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, దానికి కారకులను ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం, ఇలా ఆనాటి సమాజంలో జరిగినవన్నీ ఈ సినిమాలో మనకు కన్పిస్తాయి. అందుకే అందరికీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. విజయవాడ నడిబొడ్డున ఈ సినిమా క్లైమాక్స్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తీసారు. లక్షలాది అభిమానులు పాల్గొన్నారు. ఈ సీన్లు సినిమాలో చాలా బాగుంటాయి. అందుకే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం!

- మల్లారెడ్డి రామకృష్ణ, శ్రీకాకుళం