Others

నితిన్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో నితిన్‌కి మళ్ళీ వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. నితిన్ తాజాగా నటించిన లై, చిన్నదానా నీకోసం, చల్ మోహన్‌రంగ సినిమాల ప్లాప్‌తో టెన్షన్‌మీదున్నాడు. దాంతోపాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న దిల్‌రాజు ‘శ్రీనివాస కళ్యాణం’కూడా పెద్ద దెబ్బకొట్టింది. దాంతో ఎలాగైనాసరే హిట్‌కొట్టాలనే కసితో ఉన్నాడు. నితిన్ తాజాగా చలో సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెలలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఎంపికచేశారట. రష్మిక ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. దాంతోపాటు రష్మిక తాజాగా గీతగోవిందం సినిమాతో మంచి విజయం అందుకుని టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. మరి రష్మిక క్రేజ్ హీరో నితిన్‌కి మంచి కమర్షియల్ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి.

--శ్రీనివాస్ ఆర్.రావ్