Others

ఆమె గెలిచిందా.. ఓడిందా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు గంగాదేవి.. వయసు 37 సంవత్సరాలు.. 1975వ సంవత్సరంలో ఓ స్థల వివాదానికి సంబంధించి మిర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆమె ప్రాపర్టీకి అటాచ్‌మెంట్ నోటీస్ ఇచ్చాడు. దాన్ని ఆమె సివిల్ కోర్టులో సవాల్ చేసింది. ఈ విచారణ రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. విచారణ సమయంలో కోర్టు సూచన ప్రకారం కోర్టు ఫీజు 312 రూపాయలు చెల్లించింది. తరువాత ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వచ్చే సమయంలో ఆమె కోర్టుకు ఫీజు కట్టిన రసీదు కనిపించలేదు. ఇంట్లో ఎక్కడో పెట్టేసింది. రసీదు లేనిదే తీర్పు కాపీ ఇవ్వలేమని చెప్పింది కోర్టు.. మళ్లీ కోర్టు ఫీజు చెల్లించమంది. అప్పట్లో అది పెద్ద మొత్తమే.. ఆ డబ్బులు కట్టలేక ఆమె నిరాకరించింది. కేవలం కోర్టు ఫీజు చెల్లించలేదనే కారణంతో ఆమె గెలిచిన ఆ కేసు తీర్పు తుది ఉత్తర్వులు ఆగిపోయాయి. ఆమె కూడా మిన్నకుండిపోయింది. అలా 1977లో గెలిచిన ఆ కేసు గాలిలో ఉండిపోయింది.
సకాలంలో న్యాయం జరగకపోతే అది చాలా పెద్ద అన్యాయమే..! ఈ విషయాన్ని జిల్లా కోర్టు న్యాయమూర్తుల దగ్గరనుంచీ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల దాకా ప్రతి ఒక్కరూ అంగీకరించే విషయమే.. కానీ న్యాయమూర్తుల నిర్లక్షమో, ఆమె కోర్టు ఫీజు చెల్లించలేదన్న చిన్న కారణంతోనో నలభై ఒక్క సంవత్సరాలుగా ఆమె కేసు పరిష్కారం కాలేదు. ఈ సంవత్సరం ఆగస్టు నెలాఖరున కోర్టు ఈ విషయాన్ని గమనించింది. కోర్టులోని అనేకానేక పెండింగ్ కేసులు, తీర్పులను పరిశీలిస్తున్న క్రమంలో ఈ కేసు తిరిగి వెలుగుచూసింది. జడ్జి జైస్వాల్ ఆమెకు అనుకూలంగా పరిష్కరించేశాడు. ఎలాగంటే.. జైస్వాల్ ఈ కేసు గురించిన వివరాలను పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఫీజు కట్టి ఉంటే రికార్డులో నమోదయి ఉంటుందిగా అని ఆలోచించి.. రికార్డులను పరిశీలించగా.. ఆమె మొదట చెల్లించిన కోర్టు ఫీజు కోర్టులో జమయినట్లుగా గుర్తించాడు. 3అంటే కోర్టు ఫీజు ఆమె బాకీ లేనట్టే కదా.. అలాంటప్పుడు ఆ తీర్పు ఇనే్నళ్లు ఎందుకు ఆగిపోయినట్లు..?2 ఇదే సందేహం కలిగింది ఆ జడ్జికి.. 3ఆమెకు దక్కాల్సిన న్యాయం రెండు తరాలకు పైగా జరగకుండా ఎందుకు ఆగినట్టు? ముందే కోర్టుకు ఫీజు చెల్లించాక కూడా దీన్ని ఆపడం కరెక్ట్ కాదు2 అనుకుంటూ సదరు జడ్జి ఆమెకు అనుకూలంగే వెంటనే దాన్ని డిస్పోజ్ చేశాడు. ఇలా చేసేటప్పుడు ఆమె చాలా సంతోష పడుతుంది అనుకున్నాడు. కానీ కేసు గెలిచినందుకు సంతోషపడేవారు ఎవరూ లేరక్కడ.. ఎందుకంటే గంగాదేవి 2002లోనే మరణించింది.. జైస్వాల్ పంపిన కోర్టు తీర్పు కాపీ ఆమె కుటుంబసభ్యులెవరికో చేరింది..
ఇప్పటికి ఆ కోర్టుకు పనె్నండు మంది జడ్జిలు మారారు. ఒక్కరైనా జైస్వాల్ జడ్జిలా ఆలోచించి ఉంటే, కాస్త తెలివిగా రికార్డులను తిరగేసి ఉంటే గంగాదేవి న్యాయం జరిగి ఉండేది కదా..! ఆ న్యాయమూర్తులకు అంత తీరికెక్కడ? అందుకే కోర్టుల్లో కేసులు అలా పెండింగ్ పడుతూ కొండల్లా పెరిగిపోతున్నాయి. ఇంత ఆలస్యం తరువాత గంగాదేవికి దక్కిన న్యాయం.. నిజంగా న్యాయమేనా..!? ఇంతకూ ఆమె గెలిచిందా..!? ఓడిందా..!? ఈ ప్రశ్నకు సమాధానం.. ఆ కోర్టులో మారిన జడ్జిలే చెప్పాలేమో..!?

*