Others

తండ్రితనం కోల్పోయావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులానికి పుట్టిన దురహంకారమా...
మనువు ఇచ్చిన అంతరాన్ని ఇంకించుకుని
మానవత్వానికి మచ్చగా మిగిలావ్

మతమిచ్చిన ఉ‘న్మదం’తో
డబ్బిచ్చిన పరువు కత్తితో
రక్త ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నావ్

సమాజమిచ్చిన హోదాకోసం
కన్నబిడ్డ కలల్ని ఒక్క వేటుకి మట్టుబెట్టిన నీవైనా ఆరడుగుల జాగాలోనే అంతమవుతావ్

మిగిలిందిక నీ ఒడిలో నిదురించిన పసిబిడ్డ కన్నీటి వేడుక, చూసి తరించు ఆమె కన్నుల్లోని ధారని
నీ వికృత మనసుకు ఓదార్పునిస్తుందేమో

పెద్దరికం మాటున బోసి నవ్వుల చంటితనం కనులారా వీక్షించి ఉండవు
అమృత గొంతు పిలిచిన ‘నాన్న’నే పిలుపునీ కప్పేసిందా అంతరాల జబ్బు

వెంటాడి వేటాడిన నీ పరువుకు
మిగిలిందిపుడో సామాజిక వెలివేత
అవును,
తండ్రితనం కోల్పోయిన విచక్షణ హీనుడికి సమాజమివ్వాల్సిందీ వెలివేతే!

-నస్రీన్‌ఖాన్ 8555857330