Others

ప్రేమంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపు చినుకు తోడైతే
చిగురు పుట్టినట్లు...
చూపు చూపు కలిస్తే
ప్రేమ మొగ్గ తొడుగుతుంది!
మనసు మనసు కలిస్తే
పుష్పమై
ఆనందపు సుగంధాలను వెదజల్లుతుంది
ప్రేమంటే
ఇరుగుండెల యుగళగీతం!
హృదయపు లోతుల్లోంచి
వినిపించే మధుర రాగం!
త్యాగంతో పునాదులు పడితేనేం ?
విశ్వాసం లేనిది
ప్రేమ భవంతి నిలబడదు!
తెలిసీ తెలియని వయసులో
మిడిమిడి జ్ఞానం ముసుగులో
‘ఆకర్షణ’ అలల నురుగులో
పురుడు పోసుకునే ప్రేమ
చివరకు ‘గాలిబుడగే’ అవుతుంది!

-దాస్యం సేనాధిపతి 9440525544