Others

కొందరు నాన్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా జీవిత పుస్తకంలో
ఎన్నో పేజీలు కదిలిపోయాయి
ఆ జ్ఞాపకాల హోరుగాలులలో
ఒక చేదు జ్ఞాపకం మా నాన్న
అతనికేమీ పనీపాట లేక
అమ్మని హింసిస్తూ ఉండేవాడు
తిట్లరూపంలోనో, తన్నుల రూపంలోనో
అమ్మ ఉద్యోగం చేసి
తెచ్చిన డబ్బులను తాగి తగలేసేవాడు నాన్న
అప్పుడప్పుడు
అమ్మ వెక్కివెక్కి ఏడ్చే ఏడుపులు
నాకింకా జ్ఞాపకమే!
‘అమ్మా! నీవెందుకమ్మా ఏడుస్తున్నావమ్మా’ అనే నాకు
‘ఏం లేదులే అమ్మా!
నీవు బాగా చదువుకో ఇవేమీ పట్టించుకోకు’
ఏడుపును ఆపుకుంటూ పలికే అమ్మ గొంతు
నాకింకా జ్ఞాపకమే!
‘నీవు బాగా చదవాలి’ అనేది అమ్మ కోరిక
అర్థరాత్రిలో నాన్న లేచి కూర్చుని
మనం దీన్ని చంపేసి
మనదారి మనం పోదాం,
మనకిది బరువు అనేవాడు
నీవు వెళ్లు .. నేను రాను అనేది అమ్మ
ఆ వాళ్లిద్దరి మాటలు నా చెవులు వద్దన్నా వినేవి
అమ్మ నన్నొదిలి ఎక్కడ వెళ్లిపోతుందో అని
నేను కళ్లల్లో వత్తులు వేసుకొని
అమ్మకు కావలిగా కూర్చున్న
నిదురులేని రాత్రులు ఎనె్నన్నో
నాన్న ఎన్ని చిత్ర హింసలు పెట్టినా భరించింది
ఎంత అవమానం చేసినా ఊరుకొంది
ఎన్ని పిడిగుద్దులు గుద్దినా సహించింది
చివరకు మమ్మల్నిద్దరినీ వదిలేసి వెళ్లినా .....
అమ్మ నన్ను గాలికి వదిలేయక
పెంచి నన్ను నన్నుగా తీర్చిదిద్ది
నా భవితకు ఆమె మొదటి సోపానమై
రాజమార్గంలో నన్ను నడిపించి
పక్కకు తప్పుకున్న ఆమెకు
ఏమివ్వగలను?
అందుకే నేనంటాను అమ్మ .. అమ్మే
ఇక నాన్న కొందరికి మాత్రమే
మరికొందరికీ ఇదిగో ఇలాగే....

-కె.జి. దేవి అనంతపురం -- 9440230401