Others

వయస్సుతో పనేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయం చాలా విలువైనది. అందరికీ రోజుకు 24 గంటలే. కొంతమంది రోజుకు లక్షలు సంపాదిస్తుంటే మరికొంతమంది ఒక పూట గడవడానికి నానా తిప్పలు పడుతుంటారు. మరికొందరు నిద్రే లోకంగా రాత్రే కాక పగలు కూడా నిద్రపోతుంటారు. మరికొందరు ఇంట్లో పనితోపాటు స్వయం ఉపాధిమార్గాలను కూడా తమవైపుకు తిప్పుకుంటూ ఉంటారు.
మనిషి వయస్సులో కొంత వయస్సులో మాత్రమే అనుకొన్నపనులు చేయగలుతారు. బాల్యంలో అయితే ఏం తెలీని వయస్సు. బాధ్యతలుండవు. పెద్దవాళ్లు చెప్పినట్టు చదువుకోవడం , ఆడుకోవడం చేస్తుంటారు. ఇక ముసలి వయస్సులో అన్నీ తెలిసి ఉన్నావిజ్ఞానమెంతో ఉన్నా , అనుభవమున్నా కూడా కొన్ని పనులను చేసుకోలేకపోతారు. వయస్సు రీత్యా వారిలో బలం తగ్గి అనుకొన్న పనులు చేసుకోలేరు. వయస్సుతో వచ్చే మార్పుల వల్ల అంటే మతిమరుపు, బరువు నెత్తుకోలేకపోవడం ఇట్లాంటి వాటి వల్ల ఆలోచన ఉన్నా కోరిక ఉన్నా తీర్చుకోలేకపోతారు.
ఏది ఏమైనా మధ్యవయస్సులోనే అనుకొన్నదాన్ని సాధించడానికి వీలుంటుంది.
అందుకే వీలున్నప్పుడల్లా కొత్త భాషలు నేర్చుకోవడం చేయండి. లేదంటే మీలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి మంచి మంచి బొమ్మలు తయారు చేయడం, లేదా పిల్లలల్లో ఆలోచనాశక్తిని పెంపొందించేలా ఆటలు తయారు చేయడం లాంటివి చేయండి. సంపాదనా మార్గాలను కూడా సృష్టించండి. ఇలా చేయడం వల్ల మీలో సంతృప్తి అవతలివారికి సహాయం చేసినట్టు అవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నట్టు కూడ ఉంటుంది. జారిపోయిన కాలం వెనక్కు రాదు కనుక ఉన్న సమయాన్ని వృథాగా గడపకుండా మంచి పనులకు కేటాయించుకోవాలి. అపుడే మీరు ఇతరులకు ఆదర్శవంతులుగా కూడా ఉంటారు. మీలో ఉత్సాహం రెట్టింపు అయి మీ ఆయుష్షును కూడా పెంచుతుంది. జీవించినంతకాలమూ ఏ అనారోగ్యం లేకుండా హాయిగా తిరుగుతూ ఆడుతూపాడుతూ గడిపే ఛాన్స్ మీకు వస్తుంది. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
ఇలా చేయడంతో సమాజం పట్ల మంచి అవగాహన వస్తుంది. సమాజాభివృద్ధికి మీవంతు సాయం చేసినట్టు అవుతుంది.

- వాణి