Others

తులాభార గణపతి .. వేలివెన్ను లక్ష్మీగణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
భావం: తొండం వంకరగాను, శరీరము పెద్దదిగాను కోటి సూర్యులు యొక్క కాంతితో సమానమైన ప్రకాశం గలవాడును, ఎటువంటి విఘ్నములైనను తొలగించేవాడును, అన్ని పనులు సఫలం చేసే వాడును అయినటువంటి ఓ వినాయకా! నీకు నమస్కారములు సమర్పించుచున్నాను.
పైన చెప్పిన లక్షణాలు అన్నీ కలగలిపి, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు, పిల్లలు పుట్టనివారికి సంతానప్రాప్తిని అనుగ్రహించే ఆదిదేవుడిగా వెలుగొందుతూ గత 70 సంవత్సరాలుగా భక్తుల కొంగు బంగారమై వేలివెన్ను గ్రామంలో వెలసిన లక్ష్మీ గణపతి స్వామివారు వెలుగొందుతున్నారు. 70 సంవత్సరాల పూర్వం వెదురు తడికలతో అల్లిన వినాయకుని విగ్రహానికి లక్ష్మీ గణపతిగా నామకరణం చేసి ఉత్సవాలు చేయడం ప్రారంభమైంది. పేరుకు తగ్గట్టుగానే అది లక్ష్మీ గణపతియే. నిత్యం డబ్బుల దండలతో ప్రకాశిస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రజలు మరియు వేలివెన్నుతోపాటు చుట్టుప్రక్కల గ్రామాలవారు స్వామికి మ్రొక్కుకుని గణపతి నవరాత్రుల సమయంలో వేలివెన్ను వచ్చి స్వామికి మ్రొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఏదైనా గుడిలో మ్రొక్కులు అంటే పూజలు, వ్రతాలు, కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు చేస్తారు. కాని మన వేలివెన్ను లక్ష్మీ గణపతికి మాత్రం కొత్త కరెన్సీ కాగితాలతో దండలు కట్టి స్వామికి వేస్తూ ఉంటారు లేదా చిన్నపిల్లలను డబ్బులతో తూచి ఆ డబ్బులను స్వామికి సమర్పిస్తారు. అందుకే అందరూ స్వామిని లక్ష్మీ గణపతిగా కొలుస్తారు.
వినాయకచవితి నెల రోజులకు ముందు స్వామివారి ఉత్సవ కార్యక్రమం కోసం స్వామివారి పాత అలంకరణ తీసి కొత్తగా అలంకరిస్తారు. ప్రతీ సంవత్సరం కొత్తగా ఉండేలా స్వామి వారి అలంకరణ ఒక మహాయాగంలా నిర్వహిస్తారు. బూరుగుపల్లి సూర్యారావు, పి.వి.ఆర్.జి. వి. ప్రసాద్, శిరిగిన శివరాధాకృష్ణ, నందిగం భాస్కర రామయ్య, బూరుగుపల్లి వేణు, శిరిగిన నరసింహమూర్తుల ఆధ్వర్యంలో ఈ క్రతువును పూర్తిచేసి వినాయక చవితి రోజున స్వామివారిని గాంధీ బొమ్మ సెంటర్‌నందు వేంచేయిస్తారు. వినాయకచవితి మొదలు 11 రోజులపాటు స్వామివారి సమక్షంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, 11వ రోజు లక్ష్మీగణపతి స్వామివారికి అంగరంగ వైభవంగా, వివిధ రకాల మేళతాళాలతో, వేషధారణలతో, బాణసంచా కాల్పులతో శిరిగిన శివరాధాకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కొసమెరుపు ఏమిటంటే స్వామివారిని ఊరేగించే రధాన్ని సరికొత్తగా తయారుచేయడం విశేషం. వేలకొద్ది జనం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం తిలకించడానికి వేలివెన్ను తరలివస్తారు. ఈ సంవత్సరం ఊరేగింపు కార్యక్రమం 23వ తేదీ ఆదివారం నిర్వహిస్తారు. ఇంకొక సంప్రదాయం ఏమిటంటే ఏ కార్యక్రమం ఎవరి ఇంట్లో ఏమి జరిగినా ముఖ్యంగా వివాహ క్రతువులలో స్వామివారికే మొట్టమొదటి శుభలేఖను సమర్పించడం ఆనవాయితీ. విద్యాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి కొరకు, వివాహప్రయత్నం సఫలం కావడానికి స్వామివారి సేవ విశేషమైన ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. గత 70 సంవత్సరాలుగా స్వామివారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఎందరో పెద్దలు తరించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, తాత్వికవేత్తలు, సాధువు పుంగవులు స్వామివారి సేవలో తరిస్తూ వేలివెన్ను గ్రామ ప్రజలను మరియు లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులను తరింపజేస్తున్నారు.

- సి.హెచ్. కోటేశ్వరరావు 9948599386