Others

మనిషితనం చచ్చిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషితనం చచ్చిపోయింది
కడుపు చించుకు పుట్టిన బిడ్డ
పురిట్లో చచ్చినా బాగుండేది

పాతికేళ్ల వయసుని కత్తికి బలిచ్చి
పరువుదాహం తీర్చుకున్నారు

రంగేది అయినా రక్తం ఒక్కటే
అమ్మ కడుపు నుంచి శ్మశానం దాకా
కులం కావళ్లు మోస్తూ మీకు మీరు
ఆత్మ వంచన చేసుకుంటారు

పసిపిల్లల ప్రేమకి కులం కుంపటి
వందేళ్ల ప్రయాణానికి చరమగీతం పాడింది

యుగాలుగా అణిచివేతలో బడుగు జీవులు
పేడపురుగులై చస్తూనే ఉన్నారు

అమావాస్య చీకటిని బలవంతంగా
రేపటి వెలుగుని మింగేసింది

కులాల సంఘర్షణలో మనిషితనాన్ని చంపి
విర్రవీగుతున్నావు..
నిండు గర్భిణి దుఃఖ శోకం
ఎవరు తీర్చగలరు...

మనిషితనాన్ని నాశనం చేసిన చరిత్రని
ప్రపంచం ఎప్పటికీ క్షమించదు..!!

-పుష్యమీ సాగర్ 90103 50317