Others

సిరినిచ్చే సిద్ధి వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని నమ్మని వారు అరుదు. అనాదిగా భగవంతుని ఆరాధన ఉంటూనే ఉంది. భగవంతుడు లేక పరమాత్మ ఒక్కడే అయినా ఎవరికిష్టమొచ్చినట్లు వారు అనేక పేర్లతో అనేకరూపాలతో భగవంతుడిని ఆరాధిస్తుంటారు. కొందరు మహావిష్ణువే సర్వం అని కొలిస్తే మరికొందరు ఈశ్వరుడే సర్వాధికారి అని స్తుతిస్తారు.
వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి అయిన భగవద్గీతలో స్వయంగా భగవానుడు కర్తవ్యపాలన చేయండి. నేను మీ యోగక్షేమాలను చూస్తాను అని చెప్పాడు. ఆ భగవానుడే మీరు ఎన్నివిధాలుగా ఎన్ని రూపాలతో, నామాలతో పూజించినా నదులన్నీ సముద్రంలోకి కలిసినట్లుగా మీ పూజలన్నీ నాకే చెందుతాయి అని చెప్పాడు.
అందుకే శివకేశవులకు అభేదం చెప్తారు. విఘ్ననాయకుడుగా వినాయకుడ్ని పూజించడం మన సంప్రదాయం. భారతీయులే కాదు ప్రపంచంలో చాలామంది వినాయకుని అనేక రూపాల్లో పూజిస్తుంటారు. వినాయకునికి 32 రూపాలున్నాయనీ చెప్తారు. బుద్ధి, సిద్ధిని ఇచ్చే వినాయకుడినే గణపతి అని పిలుస్తారు. శివకల్యాణం జరిపేటపుడు కూడా విఘ్నాలు కలుగకూడదని వినాయకుని పూజిస్తారు. అందుకే ఆదిదేవునిగా వినాయకుడు పూజలందుకుంటాడు. భాద్రపదమాసంలో వినాయకచవితి పేరిట నవరాత్రులు జరుపుతారు.
వినాయక చవితినాడు వినాయకుడిని ప్రతివారు వారి వారి ఇండ్లల్లో పూజించుకుంటారు. దానితోపాటే ప్రతివీధి కూడలిలోను పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి సామూహిక పూజలు చేస్తారు. ఆదిదేవుడు తమ జీవితాల్లో విఘ్నాలు లేకుండా చేసి అన్నింటా విజయం ప్రసాదించాలని కోరుకుంటారు. ఆ వినాయకుణ్ణే ప్రతిరోజు పూజించాలనే కోరికతో ముంబయివాసులు ప్రభాదేవి అనే ప్రాంతంలో వినాయకునికి అత్యంత అపురూపమైన ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని 1901 నవంబర్‌లో 3 1/2 మీటర్ల విస్తీర్ణంలో దూబేపాటిల్ అనే వనిత నిర్మించారు. ఈ ఆలయమే కాలక్రమేణా నేడు 6 అంతస్థుల భవనంగా మారింధి. ఇక్కడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇలా చేశామని ఈ ఆలయ ధర్మకర్తలు చెప్తారు.
అంతేకాదు వినాయక ఆలయంలోని గర్భాలయపు పైకప్పు బంగారు తాపడం చేసి ఉన్నారు. ఆలయ ముఖ ద్వారంపై చెక్కి ఉన్న అష్ట వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయ. ఆలయసౌందర్యాన్ని చూచి తీరవలసిందే కాని వర్ణించడానికి వీలులేదు.
ఈ ఆలయంలోని వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఒక చేతిలో కమలం, మరొక చేతిలో గొడ్డలి, ఇంకొక చేతిలో తాపడం, వేరొక చేతిలో పునుగులతో వినాయకుడు ఇక్కడికి వచ్చే భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ వినాయకుని దర్శించినవారికి డబ్బుకు కొదువవుండదని అంటారు. వినాయకుని భక్తులంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతారనే ప్రసిద్ది ఈ వినాయకునికి ఉంది. అంతేకాక ఎవరు ఏపని మొదలెట్టినా ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఈ వినాయకునికి అష్టోత్తర శతనామాలతో పూజించి విఘ్నాలు తొలగించమని ప్రార్థించి ఆ తరువాత అనుకొన్న పనిని ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్లే వారంతా అనుకొన్నది సాధిస్తున్నారని చెప్తారు. ఈ సిద్ధి వినాయకుని దర్శనం సర్వసిద్ధిప్రదం అంటారు.

- జి. వెంకట్రావు 8885273869