Others

చమురు మంట చల్లారే దారే లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చమురు ధరలపై చర్చ ముదిరి పాకాన పడింది. ప్రతివాళ్ళ నోటా చమురు మాటే. చమురు లేకపోతే బతుకులేదన్న చందంగా చర్చలు సాగుతున్నాయి. కారణం ప్రపంచ దేశాలలో భారత్ చమురు వాడకంలో మూడవ పెద్ద దేశం. ఒకప్పుడు బస్సులో, రైలులో ప్రయాణం చేయడమే కష్టంగా వుండేది. క్రమంగా దేశం అభివృద్ధి పథంలోకి రావడం, కొనుగోలు సామర్థ్యం పెరగడం, బ్యాంకులు వాహనాలు కొనుక్కునేందుకు సులభ వాయిదాల్లో రుణాలు ఇవ్వడం, రహదారుల అభివృద్ధి, కాలం విలువ పెరగడం, ఖర్చుకు వెనుకాడకపోవడం ఇవన్నీ వొక్కసారిగా సగటు మనిషిని ప్రగతిగామిని చేసేశాయి. 1993లో లీటరు 11 రూపాయలుగా ఉన్న పెట్రోలు గత 25 ఏళ్ళలో రూ.80/- పైకి పాకినా, సగటు మనిషికి సొంత వాహనాన్ని మించిన పుష్పక విమానం కనబడడం లేదు.
నిజానికి జన బాహుళ్యం ఎక్కువగావున్న భారత్ లాంటి దేశాల్లో జనంతో కూడిన వాహన రవాణా (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) పెరగాల్సిన అవసరం ప్రభుత్వాలు గుర్తించేలోపే అందరికీ వాహనాలు అమరడం, కొనుగోలు చేయడం జరిగిపోతోంది. కొందరికి రెండు వాహనాలు కూడా వుంటున్నాయి. సైకిళ్లకు లైసెన్సు తీసేసినా వాటిపై తిరిగే జనం అంతగా కనిపించడం లేదు. నగరాలలో అయితే కొన్ని కుటుంబాల్లో రెండు, మూడు కార్లు ఉంటున్నాయి. నిత్యావసర వస్తువులకంటే చమురు (పెట్రోలు, డీజిలు) అవసరం బాగా పెరిగిపోయింది. ఎటొచ్చీ దీన్ని రాజకీయం చేయడం వల్లనే చమురు చిచ్చు పెట్టినవారి పూర్వాపరాల జోలికి వెళ్ళాల్సివస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఇంతకుముందు పదేళ్ల పాటు యూపీఏ సర్కారు అధికారం వెలగబెట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు తక్కువగా వుండేవని, ఎన్డీఏ హయాంలో ఎక్కువయ్యాయని కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరిచి, ఈనెల 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. 21 పార్టీలు తమతో వస్తాయని ఆశించింది. కాని కాంగ్రెస్ వేదిక మీద కేవలం ఐదు పార్టీలు దర్శనమిచ్చాయి. పెట్రో మంటలతో రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని కూలదోయాలని కాంగ్రెస్ కలలుకంటోంది. చమురు ధరలు పెరిగినమాట వాస్తవం. నేడు పెట్రోలు ధర అత్యధికంగా మహారాష్ట్ర పర్ఛానిలో లీటరు ధర రూ.89.97 పైసలుగా వుంది. గుజరాత్‌లోని భేడాలో రూ.67.20కే అతి తక్కువ ధరకు దొరుకుతోంది.
ఢిల్లీలో గత 14 ఏళ్లలో పెట్రోలు, డీజిలు ధరల వృద్ధి ఇలా ఉంది..

చమురు మే 2004 మే 2008 మే 2014 మే 2018
-----------------------------------------------------------------------------------------
లీటర్ పెట్రోలు రూ.33.71 రూ.40.62 రూ.71.41 రూ.80.73
లీటర్ డీజిల్ రూ.21.74 రూ.30.86 రూ.56.71 రూ.72.83

పై పట్టికను పరిశీలిస్తే అర్థమయ్యేదేమిటంటే గత నాలున్నరేళ్ళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కంటె యూపీఏ పదేళ్ల పాలనలో పెట్రోలు, డీజిల్ ధరల వృద్ధి చాలా ఎక్కువగా వుంది. 2008లో బ్యారెల్ పెట్రోల్ ధర గరిష్టంగా 140 డాలర్లు వుంది. 2016లో 30 డాలర్లకు వచ్చింది. మళ్ళీ యిప్పుడు 78 డాలర్లకు చేరింది. అయితే బ్యారెల్ ధర తగ్గినపుడు కేంద్రం ధర తగ్గిస్తే అందులో 20% మేరకు వినియోగదారుడికి లబ్ధి కలుగుతుంది. 20% అభివృద్ధి కోసం వెచ్చించబడుతుంది. కాని కేంద్రం ధర తగ్గించినపుడల్లా రాష్ట్రాలు వ్యాట్ రూపంలో అధిక శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. అందుకనే ఒక్కో రాష్ట్రంలో వ్యాట్ ఒక్కో రకంగా వుంటోంది. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 2014లో లీటరుకు రూ.9.45 పైసలుండేది. 2018 జనవరిరో అది గరిష్ఠంగా రూ.21.48కి చేరింది. కాని ఎక్సైజ్ సుంకంలో 42శాతం రాష్ట్రాలకు లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్రం జాతీయ రహదారులు, గ్రామీణ రహదారుల కోసం వెచ్చిస్తుంది. కనుక పెట్రోలు, డీజిల్ ధరల్లో కేంద్ర ప్రమేయం చాలా తక్కువ అనే విషయం స్పష్టమవుతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ లాభాన్ని చమురు దిగుమతులకై గత యూపీఏ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి వినియోగించింది. ఆ విధంగా ఇరాన్‌కు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పును చెల్లించింది. కాని యిది ఎవరికి కావాలి? యూపీఏ చేసిన పాపానికి ఎన్‌డీఏకు పరిహారం తప్పలేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధరల తగ్గుదలను మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదలకు కాకుండా కొన్ని భారీ ప్రాజెక్టుల కోసం వాడుకుంది. పోర్టుల అభివృద్ధి (సాగరమాల), రోడ్ల అభివృద్ధి (్భరత్ మాల), ఎయిర్‌పోర్టుల అనుసంధానం (ప్రధానమంత్రి యోజన), ప్రధానమంత్రి యోజన, ఉజ్వల (ఎల్‌పిజి కనెక్షన్లు), ఉజాల (ఎల్‌యిడి బల్బుల పంపిణీ), ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు (జనరిక్ మెడిసిన్), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల రూపంలో నిజమైన పేదలకు (అంత్యోదయ) లబ్ధి చేకూరే విధంగా యోచించింది.
గత యూపీఏ సర్కారు ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం, ఆహార భద్రతా చట్టం అమలువంటివి వుండనే వున్నాయి. ఇంత జరిగినా ఆర్థికమూలాలను క్రమశిక్షణతో పోషించుకుంటూ వస్తున్నది మోదీ ప్రభుత్వం. కరెంటు ఖాతాలోటు యుపిఎ హయాంలో జీడీపీలో 5% వుండేది. ప్రస్తుతం 2-3% వుంది. ద్రవ్యోల్బణం 10 శాతం నుండి ఎన్‌డిఎ హయాంలో 3.5% తగ్గింది. రాయితీలిచ్చి ఆర్థికవ్యవస్థ కుప్పకూలేందుకు కారణమైన యుపిఎ కన్న రాయితీలను కట్టడిచేసినా ప్రజాసంక్షేమం కుంటుపడకుండా పెట్రోలు, డీజిల్ ధరల వృద్ధిని నియంత్రించుకుంటూ ఎన్‌డిఎ ప్రభుత్వం పనిచేస్తున్నది. 20 లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగుచూసిన యుపిఎ ప్రభుత్వ పనితీరు ఎన్‌డిఎ ప్రభుత్వ సంక్షేమ చర్యల ముందు దిగదుడుపే. చమురు ధరలపై పన్నులు తగ్గించడం పర్యావరణపరంగా హాని కలిగించేదే. పెట్రోఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరిగి కర్బన ఉద్గారాల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. పెట్రో ధరల పెరుగుదల వల్ల రాష్ట్రాలకు రూ.22,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాల వారు వ్యాట్ తగ్గించుకొనే వీలుంది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్నాటకలో యిప్పటికే వ్యాట్‌ను తగ్గించారు. కాని కేంద్ర ఆదాయం పెద్దగా పెరిగేది లేదు. రాబోయే రోజుల్లో భారత్‌లో వాహనాలు 15% విద్యుత్తుతో నడవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. దీనివల్ల శిలాజ ఇంధనాల అవసరం తగ్గే అవకాశం వుంది. చమురు కంపెనీలను ఋణ విముక్తం చేసిన మోదీ ప్రభుత్వం చమురుపై సబ్సిడీ భారాన్ని భరించమని చమురు కంపెనీలను కోరవచ్చు. ఓఎన్‌జిసి ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో రికార్డుస్థాయిలో 58.32 శాతం అదనపు ఆదాయం ఆర్జించింది.
జీవితమంతా పెట్రోలు, డీజిల్ ధరలపైనా ఆధారపడి లేదు. అవసరమైనపుడు జనం సమస్యలకు స్పందించడం కూడా అవసరం. ప్రభుత్వాన్ని అన్నింటికీ నిందిస్తే ప్రయోజనం లేదు. గతంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలో వున్నపుడు పెట్రో ఉత్పత్తుల కొరత కారణంగా కేవలం నియమిత వేళల్లోనే పెట్రోలు బంకులు పనిచేసేవి. పెట్రో ధరలను పక్కనపెట్టి గత జులై నుండి అమలులోకి వచ్చిన జిఎస్‌టిని గురించి చర్చిస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. జిఎస్‌టివల్ల సామాన్యుడి జీవితంలో చాలా విషయాల్లో ఖర్చు ఆదాఅవుతున్నట్లు కింది పట్టిక ఋజువుచేస్తుంది. పెట్రో ధరల విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజానుకూల నిర్ణయాలు చేస్తాయని ఆశిద్దాం.

ఖర్చు వివరం 2014లో 2018లో
---------------------------------------------------------------
టూత్‌పేస్ట్, సబ్బులు,
హెయిర్ ఆయిల్ 26% పన్ను 18% పన్ను
ఎల్‌ఇడి బల్బు రూ.310 రూ.70/-
ఇంటి రుణం వడ్డీ 10.15% 8.80%
కారు రుణం వడ్డీ 10.95% 8.90%
చదువు రుణం వడ్డీ 14.25% 10.15%
1జిబి ఇంటర్నెట్
డేటా రూ.270 రూ.19
హోటల్ ఖర్చుపై 14.42% పన్ను 5% పన్ను
గుండె స్టెంట్ రూ.1,98,000 రూ.29,000
దంతాల ఖర్చు రూ.1,58,000 రూ.55,000
కందిపప్పు 90/-కిలో రూ.70/-కిలో.
65/- కిలో రూ.60/-కిలో.
నెయ్యి రూ.36.50/లీ రూ.42/లీ
ప్రభుత్వ నియంత్రణలో
లభించే మందులు 404 958
===================================

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888