Others

త్యాగం ఇదియేనా.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన గొప్ప చిత్రం ‘మంచి మనసులు’. ఆ చిత్రంలో విచిత్రమైన నేపథ్యం కలిగిన కమనీయ గీతం ‘త్యాగం ఇదియేనా.. హృదయం శిలయేనా... ఏలా ఈ మోసం?’అన్నది.
ప్రాణపదంగా ప్రేమించిన ప్రేయసిని అనివార్య పరిస్థితుల కారణంగా త్యాగంచేసిన కథానాయకుడు ఒక అంధురాలిని వివాహం చేసుకుని, ఆ ప్రేయసి ఊహల్లో నలిగిపోతూ భార్యను దూరంగా ఉంచి కుమిలిపోతుంటాడు. విషయం గ్రహించిన ప్రేయసి అతని బాధ్యతను గుర్తుచేస్తూ హెచ్చరించడం, అనె్నంపునె్నం ఎరుగని ఆ అమాయకపు అంధురాలిని అతనికి దగ్గరచేయడం, అతనికి కనువిప్పుకలిగించి భార్య పట్ల మమకారాన్ని, మమతను కలిగించడానికి ఆ ప్రేయసి చేసే హెచ్చరికా ప్రయత్నమే ఈ గీతం. ‘నిగ నిగ మెరుస్తున్న ఆ తాళిని, గలగలలు దూరమైన ఆ చేతి గాజులు, ఇంకా ఆరిపోని పారాణి ఆనవాళ్లు చూడు... జాలి... మమత లేని నీ త్యాగం ఎందుకు? నీ హృదయం శిలలా ఎందుకిలా మారింది?’ అంటూ నిలదీస్తుంది. పాడింది సుశీలమ్మ. రాసింది శ్రీశ్రీ. స్వరాలు సమకూర్చింది మామ మహదేవన్. ఓ పక్క అక్కినేని. మరోపక్క సావిత్రి. పిఎల్ రాయ్ ఫ్రేమ్‌లో కనిపిస్తుంటారు. వీళ్లంతా మంచి మనసులు (1962)ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. ఓసారి పాట వినండి. నచ్చనివారుండరు.

-తాడి అప్పలస్వామి, పార్వతీపురం