Others

దేవదాసు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏతరం వాళ్లకయనా ఏఎన్నాఆర్ దేవదాసు- ఓ అద్భుత కళాఖండం. ప్రేమ నిర్వచనానికి పార్వతి, దేవదలే సజీవ దర్పణాలు. హీరో హీరోయిన్ పాత్రలు రెండూ విషాదంగా ముగుస్తాయ. ఒకరి చావు వార్త విన్న మరొకరు వెంటనే తనువు చాలించటం.. - ప్రేమలో ఆత్మల అనుసంధానాన్ని చెప్పక చెప్పడం అద్భుతమే. అక్కినేని, సావిత్రిల నటన శిఖరాగ్రం. ముఖ్యంగా అక్కినేని ఏం తెచ్చానో చెప్పుకో? అన్నప్పుడు సావిత్రి తినుబంఢారాలను చెప్పటం గొప్ప చిలిపిదనం, హాయిని గొలిపే సన్నివేశం. అదే పాత్రలు మళ్లీ విషాద సన్నివేశంలో ఉన్నపుడు కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. గొప్ప వ్యత్యాసం. సినిమా ఒకెత్తు.. పాటలు మరో ఎత్తు. పల్లెకు పోదాం... పారులు చూద్దాం ఛలో ఛలో, అంతా భ్రాంతి యేనా... జీవితాన వెలుగింతేనా?, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, అందం చూడవయా ఆనందించవయా, చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు, ఓ... దేవదా చదువూ ఇదేనా.. మనవాసీ వదిలేసి అసలు దొరల్లే సూటూ బూటూ’... దేనికదే. అన్నీ చక్కగా అమరిన సాహిత్యసంగీతాలతో గాయనీ గాయకులతో సందర్భానుసారంగా కుదిరిన దేవదాసు ఏ తరానికైనా -ఓ అద్భుత కళాఖండమే.

-పి మల్లికార్జునరావు, నెల్లూరు