Others

విశిష్ట నటుడు ముక్కామల( వెండివెలుగులు-2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపిష్టి పాత్రలకు, ఊరికే ఆగ్రహం తెచ్చుకునే పాత్రలకు పెట్టింది పేరు ముక్కామల. ముక్కామల అసలు పేరు ముక్కామల కృష్ణమూర్తి. విశ్వామిత్రుడు, భృగుమహర్షి, దుర్వాసుడు, ధౌమ్యమహర్షి ఈ పాత్రలను చలన చిత్రాల్లో చూస్తే మనకు చొప్పున జ్ఞాపకంవచ్చే వ్యక్తి ముక్కామల.
సన్నగా, పొడుగ్గా, పొట్లకాయలా, పొడుంకాయలా, మితభాషణతో, అమితమైన అభిమానంతో మనం అనుకోగానే చప్పున స్ఫురణకు వచ్చే ఆకారం ఆయనది. ముక్కామలను చూస్తే ఎవరూ విలన్ అనుకోరు. కానీ అనుకోకుండా విలన్‌గా విలక్షణ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చడం ఆయనకే చెల్లింది. ప్రేక్షకులు ఏమాత్రం మర్చిపోలేని నటుడాయన. ‘గూఢచారి 116’, ‘రంగేళి రాజా’, ‘అన్నతమ్ముడు’ చిత్రాలు అందుకు ఉదాహరణలు.
స్వర్గీయ యస్వీ రంగారావు తర్వాత మాంత్రికుడి పాత్రలో మెప్పించిన దిట్ట. అసమాన ప్రతిభాశాలి, విశిష్ట నటుడు ముక్కామల. అగ్గిబరాటాలో కొండ బూచాడు, ‘జ్వాలాద్వీప రహస్యం’లో వనం కోసం ఆరాటపడే వాంత్రికుడు, ‘గురువును మించిన శిష్యులు’లో ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు ప్రదర్శించే దుష్టమాంత్రికుని పాత్రలకు జీవం పోశారాయన. దుర్యోధనుడు, శకుని, విరాటరాజు, కంసుడు, సైంధవుడు ఇలాంటి దుష్టపాత్రలకు ప్రాణంపోసిన అసమాన నటుడు ముక్కామల. ముక్కామల సంభాషణలు చెప్పే తీరే వేరు. అలా చెప్పటం చిత్రపరిశ్రమలో ఇప్పటికీ ఎవరికీ రాదు.
కూతురి పెళ్ళికోసం మరో వివాహిత కాపురం కూల్చడానికి అడ్డదారులు తొక్కే ముసలినక్కను మించిన ‘సోమరాజు’ పాత్రను ‘ముత్యాలముగ్గు’లో అవలీలగా వేశారాయన. దేశ క్షేమాన్ని వదిలి స్వార్థంతో అలెగ్జాండరును పోరస్‌పై దండెత్తమని ఆహ్వానించే ‘అంభి’ పాత్రను సమర్థవంతంగా ‘చాణక్య చంద్రగుప్త’లో పోషించారు. దాదాపు 200 పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యంగల పాత్రలు పోషించిన నటుడు ముక్కామల. ‘కార్తవరాయని కథ’ ఆయన నటించిన జానపద చిత్రాల్లో మరొకటి. కాలాన్ని వృధాచేయక ఎప్పుడూ ఏదో ఒక కార్యసాధనలో నిమగ్నులై ఉండేవారాయన. ‘ఋష్యశృంగ’, ‘మరదలు పెళ్ళి’ చిత్రాలకు దర్శకత్వమూ వహించారు.
నటించబోయే పాత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, క్రమశిక్షణతో మెలగడం, సాటి నటీనటుల్ని గౌరవించడం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. కోడెనాగులోని ప్రిన్సిపాల్ పాత్రలో ఆయన జీవించాడు.
‘సంపూర్ణ రామాయణం’, ‘సత్యహరిశ్చంద్ర’ (ఎన్టీఆర్) ‘శ్రీరామాంజనేయ యుద్ధం’, ‘సీతాకల్యాణం’వంటి చిత్రాలు ఆరింటిలో ఆయన విశ్వామిత్ర పాత్రకు ప్రాణంపోశారు. ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’లోని దుర్వాసుని పాత్రలో ఆయన నటన మరువదగినదా! ఆయన ధరించిన ‘మాయాబజారు’లో దుర్యోధనుడు, ‘నర్తనశాల’లో విరాటరాజు, ‘శ్రీకృష్ణ పాండవీయం’లో జరాసంధుడు ‘మానవుడు దానవుడు’లో దాదా, ‘బ్రహ్మంగారి చరిత్ర’లో ఫకీర్‌సాహెబ్, ‘కరుణామయుడు’లో న్యాయధికారినే శాసించే పాత్ర, ‘పాండవ వనవాసం’లో ధౌమ్యమహర్షి, ‘మాస్టర్ కిలాడీ’లో సైంటిస్టు, ‘దాన వీర శూరకర్ణ’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర వైభవం’లో భృగుమహర్షి పాత్ర, ‘శ్రీకృష్ణావతారం’, ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాలలోని పాత్రలు ముక్కామల నటనా కౌశలానికి పతాకస్థాయ. పోషించిన పాత్రలకు జీవం పోయడం ద్వారా 1950 నుండి 1980 వరకు మూడు దశాబ్దాలు తెలుగు చిత్రసీమలో ఆయనకంటూ ఒక స్థానం సంపాదించారు. నేటికీ తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ముక్కామలది చిరస్థానం.

-డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు