Others

తనతోవుంటే... టైమే తెలీదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ విజయం తరువాత కలిగే ఆనందం... తదుపరి వచ్చే ఆలోచనలు... వీటిపైనే ఎక్కువ ‘శ్రద్ధ’పెట్టానంటోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకఫూర్. ‘స్ర్తి’తో సక్సెస్ అందుకున్న శ్రద్ధ, ఇప్పుడు ‘బట్టి గుల్ మీటర్ చాలు’ కూడా మంచి టాక్ రావడంతో ఎగిరి గంతులేస్తోంది. సామాన్యుడు భరించలేనంతగా పెరిగిపోతోన్న కరెంట్ బిల్లుల కష్టాన్ని ఇతివృత్తంగా తీసుకుని విశాల్ భరద్వాజ్ రూపొందించిన చిత్రంలో షాహిద్ కఫూర్‌కు జోడీగా కనిపించింది శ్రద్ధ. ‘హైదర్’తో విజయాన్ని అందుకున్న ఈ జంట -‘మీటర్ చాలు’తో మరోసారి హిట్ పెయర్ అనిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
‘షాహిద్ ఎక్కడుంటే చుట్టూ పరిసరాలన్నీ ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తాయ. అతనితో పనిచేయడం గుడ్ ఎక్స్‌పీరియన్స్’ అంటూ ఆనందంలో హీరోకి కితాబునిస్తోంది శ్రద్ధ. మిత్రుడిగా, యాక్టర్‌గా షాహిద్ సినిమా జర్నీకి చాలా ఇంప్రెస్ అవుతాను. 15 ఏళ్లకే కెరీర్‌ను మొదలెట్టి, వేగంగా స్టార్‌డమ్ అందుకున్నాడంటూ సక్సెస్ హీరోని ఆకాశానికి ఎత్తేస్తోంది శ్రద్ధ.
‘బట్టి గుల్..’ కోసం ఉత్తరాఖండ్‌లోని తెహ్రిలో షూటింగ్ ఎంజాయ్ చేశాం. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో కొత్త శక్తి వచ్చినట్టయ్యింది. సిటీకి తిరిగి రావాలని అనిపించలేదు అంటూ ప్రాజెక్టు విషయాలు చెప్పుకొచ్చింది. ‘స్ర్తి’లో మిస్టీరియస్ పాత్రతో గంభీరంగా కనిపించిన శ్రద్ధ, బట్టి గుల్...లో హాయిగా సాగిపోయే అల్లరి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. కథలు ఎంపిక చేసుకోవడంలో చాలా ‘శ్రద్ధ’పెడుతున్న బాలీవుడ్ బ్యూటీ, వచ్చే సినిమా కోసం ఎలాంటి కథను ఎంచుకుంటుందో చూడాలి మరి.