Others
వేకువ వెలుగు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 September 2018
- ఇల్ల ప్రసన్నలక్ష్మి, 7013002443
సౌరభాలు వెదజల్లే
అనాఘ్రాత పుష్పరాజసాలు
విషం చిమ్మబడ్డ
తోడేలు తుమ్మెద రెక్కల్లో
చిక్కుకుని సంవేధించబడతాయ్
తెలిమంచు పొరలా మనసుని తాకుతూ
తొలకరి చినుకుల పారవశ్యపు కోరల్లో
ఆదమరుస్తూ అందం!
వ్యక్తిత్వ ఉనికిని చాటే
భావప్రకటనా స్వేచ్ఛని తిరస్కృతిగా భావించే
మూర్ఖభ్రమరాల ప్రతీకార
ప్రతిఘాతం - యాసిడ్ దాడి
హృదయమూ దేహమూ
కమిలి... కుమిలే హాహాకార వేదనాగ్నిలో
సమిధలుగా మిగిలే
అతివల అంతరంగాలు
శస్తచ్రికిత్సలన్నీ శల్యచికిత్సలై నిలిచే తరుణం
వెనె్నల జాడల్ని మింగేస్తూ
మబ్బు తునకల మసక చీకటి
చీకటి చిక్కదనాన్ని సవాలు చేస్తూ
చెదరిన ముఖ కవళికలతో
వేకువ వెలుగుని ప్రభవిస్తూ
ఆత్మస్థైర్యపు చక్కదనం