Others

ఐదో దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టుకేం తెలుసని?
బొట్లు బొట్లుగా
ఆకాశపు ముంచేతి మీద రాలడం తప్ప
నీడకింద కుక్క మూలుగుతూ

అప్పుడప్పుడు
పాములు కూడా మొరుగుతాయ
నీలాగా నాలాగా లోపలికో బయటికో
మొరిగి మొరిగి ఆకాశానికి వేలాడే
భూమిలో ఇంకిపోతాయ

ఇంటికి బొక్క పడటంతో
నగ్ననామ సంవత్సరం ఉదయంచింది
గోడమీద బల్లి పాకిన చారలు
వెక్కిరిస్తూ నా కంట్లో...

ఉదాటున పొగలు పొగలు లేచి
చేతి మణికట్టు మీద నిలబడి
నాలుగు దిక్కులకి చేరుతాయ
ఐదోదిక్కు రొమ్ము పగిలింది

చేతులు ఊపి ఊపి అలసిపోయారు
ఇక కన్నులూపాల్సిందే...
విరిగిన చూపులు నలిగి
లజ్జ నటిస్తూ సూర్యుడి దేహంలో
ఎవరో నా భుజం మీద
చేయ వేసినట్టు అనిపిస్తుంది
ఇంకెవరో పిలిచినట్టు
ఒక సన్నని పొలికేక

సమాధానం చెప్పేలోపే
మరొకరి గొంతులో
సమాధానం మూలుగుతుంది
ఊరి మధ్యలో బొడ్రాయలా నేనొక్కడినే...
పిచ్చి టెంకాయలు పగిలిపోతాయ
పుచ్చు హారతులు
గాలికే ఆహుతులౌతాయ
పళ్ళెంలో చిల్లర
ఘెల్లు ఘొల్లుమంటుంది

బొడ్రాయ కక్కుకుంటుంది
రక్తం లాంటిదేదో పారుతుంది
చేతిలోకి తీసుకున్నారు
వరాహం పక్కనే కూర్చుంది

ఇప్పటికే చెట్టుకేమి తెలియదు
రాలుతూనే ఉంటుంది
బహుశ కాలాన్ని చూసే
నేర్చుకుందేమో...!

- అఖిలాశ, 07259511956