Others

ఉనికికి ఆలంబన సహకారమే ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079

===========================

భూమితోపాటు మిగతా గ్రహ మండలాలన్నీ సూర్యుని నుండే శక్తిని గ్రహిస్తున్నాయి. భూమి మీద మనిషితో సహా అన్ని జీవులు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని కిరణజాలము నుండి ప్రాణశక్తి (జఆ్ఘ ళశళూక) ని ఫొందుతున్నాయి. సూర్య కిరణాల ద్వారా వచ్చే సూర్యరశ్మిలో అన్ని రకముల ద్రవ్యరాశి, సూక్ష్మరూపంలో ఉంటుంది. భూమి ఆ శక్తిని గ్రహించి, వాటికి సంబంధించిన విత్తనాల్లోకి, ఖనిజాల్లోకి బదిలీ చేస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో సూర్యబింబం, ‘‘దేవమధువు’’ అని చెప్పబడింది. సర్వ పదార్థాలు సూర్యరశ్మిలో సూక్ష్మరూపంలో ఉంటాయి. ఆ విధంగా లేకపోతే, సౌర కుటుంబ మందలి వివిధ గ్రహాలపై ఆయా పదార్థాలుండవనేది ఒక శాస్ర్తియ దృక్పథం.
సూర్యుడు గ్రహ కక్ష్యలలోని మధ్య కక్ష్యలోనున్నాడు. భూమితో సహా మిగతా గ్రహ మండలములకు ప్రకాశమునిచ్చుచున్నాడు. సూర్యుని యొక్క కక్ష్యా ప్రమాణము 43,31,500 యోజనములు. భూగోళ నిరక్ష ప్రదేశమునకు (ఈక్వేటరుకు) 688,627 యోజనముల యెత్తున వున్నాడు (యోజనమనగా 4.11/12ఇంగ్లీషు మైళ్లు). సూర్యుడు భువనముల మధ్య సంచారము చేయుచున్నాడని తైత్తిరీయారణ్యకములోని రుూ క్రింది మంత్రము చెప్పుచున్నది.
మంత్రము:
‘‘అవస్యం గోపామని పద్యమానం ఆచ పరాచ పఠిభిశ్చరస్తం
ససద్రి చీస్సది రిషూచీర్వసానః ఆపరీవర్త భువనేష్వన్తః’’
శ్రీ విద్యారణ్యులవారు వారి భాష్యమునందు ‘‘సూర్యుడు భువనముల మధ్య తిరుగుచున్నాడన్నది ప్రసిద్ధముగా యెరిగిన విషయమేనని వ్రాసిరి. సూర్యుడస్తమించడు ఉదయించడు. ఎల్లప్పుడూ ప్రకాశమానుడుగానే యున్నాడు.మనం తేజస్సు గురించి ప్రస్తావించినప్పుడు, పోల్చినప్పుడు, మనకు తప్పకుండా, సూర్య, సహస్ర అనే పదాలు స్ఫురణకొస్తాయి. ఉదాహరణకు భగవద్గీత 11వ అధ్యాయమునందలి 12వ శ్లోకంలో, సంజయుడు కాని ధృతరాష్ట్రుడు కాని, అర్జునుడు దర్శించిన విశ్వరూపాన్ని తాము చూడనప్పటికి, వ్యాస భగవానుని అనుగ్రహంతో సంజయుడు యుద్ధ్భూమిలో జరిగినదంతయు చూచి ధృతరాష్ట్రునికీ విధంగా చెప్పాడు.
శ్లో॥ ‘‘దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా
యది భాః సదృశీసా, స్యాద్భాసస్తస్య మహాత్మనః’’॥
ఆకాశములో వేలకొలది సూర్యులొకేసారి ఉదయించినచో ఆ కాంతి ఎట్లుండునో, ఆ విశ్వరూపుడైన పరమాత్మ కాంతియట్లున్నదని పై శ్లోకార్థం. అంతే కాదు శ్రీ లలితా సహస్ర నామాలలోని 6వ నామమైన ‘‘ఉద్యద్భానుసహస్రాభా’’ ‘‘్భగమాలిని’’ (277), భానుమండల మధ్యస్థా (275), భైరవీ (276) ఈ నామాలు అమ్మవారి స్థూల రూపం వర్ణించే క్రమంలో చెప్పినవి. అమ్మవారి కాంతి శరీరం ఆమె తేజస్సును మన శక్తికొద్దీ ఊహించుకోవాలే కాని అది మన చర్మచక్షువులకు గోచరము కానిది. ‘‘్భను, సహస్రా’’ అన్నప్పుడు, భాను అంటే సూర్యుడని, కిరణమని, వెలుగని అర్థాలు చెప్తారు.
సహస్ర శబ్దానికి, వెయ్యి సంఖ్య అనేకము, అనంతము అనేక అర్థాలున్నాయి. స,హ, అనే అక్షరాలు, పురుషునికి, ప్రకృతికి సంకేతాక్షరములుగా చెప్పబడ్డాయి. పురుషసూక్తం ‘‘సహస్రశీర్షా పురుషః’’ అని ‘స’కారముతోను, శ్రీసూక్తం ‘‘హిరణ్యవర్ణాం హరిణీం’’ అని ‘‘హ’’ కారముతోనూ ప్రారంభమైనాయి. మనిషి బ్రతికి వున్నంతకాలం తన ప్రయత్నంతో సంబంధం లేకుండా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ప్రాణాన్ని సంకేతిస్తాయి.
వీటి మధ్య సహకారమే మన ఉనికికి ఆలంబనగా ఉందన్నమాట. అందువల్లనే తైత్తిరీయోపనిషత్తు శాంతి పాఠంలో ‘‘సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై’’ అని 3సార్లు ‘‘సహ’’ శబ్దం చెప్పబడింది.
అయితే మనిషి శరీరంలో ఈ ప్రాణశక్తి ఎలా పనిచేస్తుందో కొద్దిగా పరిశీలిద్దాం. ఈ ప్రాణశక్తి రెండు ప్రధానశక్తులుగా శరీరాన్ని నడిపిస్తోంది. ఒకటి జ్ఞానశక్తి అనగా మనస్సుకి చెందినది. రెండవది క్రియాశక్తి అనగా ఆర్గానిక్. ఈ రెండు శక్తులవల్లనే మన శరీరంలోని ప్రతి కదలిక, స్పందనలన్నియు జరుగుతున్నాయని తెలుసుకోవాలి.
ఈ ప్రాణశక్తి పైన చెప్పిన విధముగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా మన శరీరంలోని హృదయము, శిరస్సు, చిన్న మెదడు, పెద్ద మెదడు, కంఠము, నాడీ మండలము, వెన్నుపూస, ఉదరము, నాభి, జననేంద్రియములు, విసర్జకావయవములు, ఎముకలు, మజ్జ, రక్తము మొదలగు అన్ని భాగములలోను కుండలిని ద్వారా శక్తిని విస్తరింపచేసి, శరీరాన్ని జీవింపచేస్తోంది. అందువల్ల ఈ ప్రాణశక్తి మన శరీరాన్ని ఆవహించి, ఆశ్రయించి యున్న సూక్ష్మదేహమని తెలుసుకోవాలి. ఈ శక్తే మనలోని, పంచకోశాలను (అనగా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు) పనిచేయిస్తున్నది.
ఐదు రూపాలలోవున్న (పైన చెప్పిన) పంచవాయువులనే మనం పంచ ప్రాణాలంటున్నాము. ఇవికాక పంచ ఉపప్రాణాలు కూడ ఉన్నాయి. అవి, నాగ, కూర్మ, క్రికార, దేవదత్త, ధనుంజయములు. మన శరీరంలోని, పైన చెప్పిన పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు చేయు పనులు, వాటి వృత్తులు స్థానములు, తదితర వివరములను ప్రక్క పేజీలోని పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చును.
పైన పేర్కొనిన పంచ ప్రాణములతోపాటు, నిర్దేశించబడని ఆరవ ప్రాణశక్తి జీవుల ప్రాణశక్తికి దోహదపడుచున్నది. అది మనము ప్రతిదినము స్వీకరించే, ఆహారము మరియు పానీయముల ద్వారా పొందేశక్తి. ఇది జీవకోటి మనుగడకు అతి ముఖ్యమైన శక్తి. యోగశాస్త్రాన్ననుసరించి, మానవ శరీరము ముఖ్యముగా మూడు శక్తుల (ప్రాణ, చిత్త, ఆత్మ) కలయిక. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రాణశక్తిలోని అతి చిన్న భాగమే మన శరీరంలో వున్నది. కావున మన జీవనమంతా ప్రాణశక్తి యొక్క ఒక అద్భుతమనుకోవాలి.
పరమాణువులోనున్న ఆకరము (ఖషళఖఒ) కంటె మన శరీరమందలి ప్రాణము మిక్కిలి సూక్ష్మమైనది. ఆ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నంతసేపు ఇది ‘‘శివము’’ ఆ తరువాత ‘‘శవము’’ కావున మన ఉనికి (జీవనము) ప్రాణము యొక్క వ్యక్తీకరణ. రెండవది చిత్తశక్తి లేక మనోశక్తి లేక వివేకము. దీనివలన ఒక సమస్యను గుర్తించగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాము, తేడాలను గుర్తించగలుగుతున్నాము.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590