Others

ఉదయమే నిద్రలేవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేకువజామునే నిద్రలేవడం చాలామంది కష్టమైన అంశం. ఉదయమే నిద్రలేసి వాకింగ్‌కో, ఎక్సర్‌సైజుకో వెళదామనుకుంటారు. పనులను చక్కబెట్టాలనుకుంటారు. కానీ నిద్రలేవలేరు. నిజంగా ఇలాంటి సమస్యతో సతమతమవుతున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని పాటించదగిన మార్గాలు ఉన్నాయి.
మనం అనుసరిస్తున్న జీవనశైలి, తీవ్రమైన పని ఒత్తిడి.. ఇలా ప్రతి పనీ ఏదో ఒకరీతిలో నిద్ర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఆలస్యానికి గురవుతుంటాము. చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా క్రమంగా త్వరగా నిద్రలేవడంతో పాటు, రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. ఇతర కార్యకలాపాల పట్ల దృష్టి పెట్టవచ్చు.
రాత్రి మితభోజనం
నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకునే డిన్నర్ మితంగా ఉండాలి. పరిమితిని మించి తీసుకునే ఆహారం, నిద్రలేచిన తర్వాత కూడా రోజంతా మైకం ఆవరించి ఉండేలా చేస్తుంది. అతిగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది. రాత్రి నిద్రవేళల్లో జరిగే కొన్ని జీవక్రియలు స్థాయిని మించి పనిచేయడం ద్వారా పైత్యప్రకోపాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రమంగా నిద్రపట్టకపోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేయడం వంటివి జరుగుతుంటుంది. కావున రాత్రివేళల్లో పరిమిత ఆహారాన్ని తీసుకోవలసినదిగా సూచించడమైనది. అలాగని అతితక్కువగా ఆహారం తీసుకోవడం కూడా సరైనది కాదు. ఈ చర్యలు సగం రాత్రిలో ఆకలి మరియు గ్యాస్ సమస్యలకు కారణం అవుతుంది. దీనివల్ల నిద్రాభంగం కలుగుతుంది. కావున సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే మంచిది. అంతేకాకుండా నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందు ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గాడ్జెట్లు వద్దు
నిద్రకు ఉపక్రమించగానే స్మార్ట్ఫోన్‌ను చేతిలోకి తీసుకుని ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్, సోషల్ నెట్‌వర్క్స్, చాటింగ్, సంగీతం వినడం మొదలైనవి. ఇలా తెలీకుండానే ఏదో ఒక అంశానికి అడక్ట్ అవడం జరుగుతుంటుంది. క్రమంగా కొన్ని గాడ్జెట్లకు పూర్తిస్థాయిలో అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే అర్ధరాత్రుల్లో బాత్‌రూంకని నిద్రలేచినా ఆయా అంశాలను పర్యవేక్షించేలా.. కొందరైతే బాత్‌రూముల్లో కూడా మొబైల్స్‌ను వాడుతుంటారు. ఈ వ్యసనం కారణంగా, ఎక్కువగా నీలికాంతికి కళ్లు ప్రభావితం అవడం జరుగుతుంది. క్రమంగా పొడిబారడం, జీవం కోల్పోవడమే కాకుండా కంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్‌కు కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు కానీ దూరంగా ఉండటం ఉత్తమం. ఇప్పటికీ నీలికాంతి వల్ల కళ్లు అధికంగా ప్రభావితం అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజువారీ వాడకంలో కూడా స్మార్ట్ఫోన్, లాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి స్క్రీన్ ఆధారిత గాడ్జెట్లను వినియోగిస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ కంటి అద్దాలు వాడడం మంచిది. ఎండ వేడిమి తగలకుండా కూడా యు.వి. రక్షణ కవచం కలిగిన, పోలరాయిడ్ సన్‌గ్లాసెస్ వాడడం మంచిది.
నిద్రపోయేముందు..
పడుకునేముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే మూత్రాశయం సరైన రీతిలో పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో జీవక్రియలు ఆరోగ్యకరరీతిలో పనిచేస్తాయి. ఫలితంగా నిద్రలో అసౌకర్యం ఉండదు. కానీ అతిమూత్ర వ్యాధి సమస్యలు ఉన్నవారు వీలైనంత తక్కువ నీటిని తీసుకోవాలి. లేకపోతే అర్ధరాత్రి పదే పదే బాత్‌రూముకని లేవాల్సి వస్తుంది.
అలారం దూరంగా..
కొందరు పేరుకు అలారం పెట్టుకుంటారు కానీ, అలారం మోగిన తర్వాత దాన్ని ఆపేసి మళ్లీ నిద్రపోతారు. తరువాత అన్ని పనులూ ఆలస్యమే.. కాబట్టి అలారం చేతికి అందనంత దూరంలో ఉంచాలి. అప్పుడే అలారం ఆపే క్రమంలో పడకనుండి లేవాల్సి వస్తుంది. అలా నిద్రమత్తు నుండి ఉపశమనం లభిస్తుంది. వెంటనే ఒక గ్లాసు చల్లని నీళ్లను తాగడం వల్ల లేదా చల్లని నీటితో మొహం కడగడం వల్ల కూడా బద్ధకం పారిపోతుంది.
నిద్రలేచిన వెంటనే..
ఒక్కోసారి నిద్ర లేచినా ఇంకా బద్ధకం వెంటాడుతుంటుంది. ఇలాంటి సమయంలో పడుకోకుండా చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. వెంటనే దంత ధావనం చేసి కాలకృత్యాలు తీర్చుకుని ఎక్సర్‌సైజులు చేయాలనుకునేవారైతే నడకో, వ్యాయామమో చేయడానికి బయలుదేరాలి. ఏదై పనిమీద వెళ్లాల్సి వస్తే వెంటనే స్నానమాచరించాలి. చల్లనీరైతే మరీ మంచిది. ఇది రోజంతా చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది. రక్తపోటు, స్ట్రోక్ సమస్యలు ఉండేవారు గోరువెచ్చటి నీటితో స్నానం చేయవలసి ఉంటుంది. వీరికి అధిక చల్లదనం ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది.
నిద్రలేచేందుకు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల నిద్ర త్వరగా లేయచ్చు. ఏ అలవాటైనా ఒక్కరోజుతో రాదు.. కానీ క్రమశిక్షణతో సాధిస్తే ఎప్పటికైనా ఫలితాలను పొందవచ్చు. నిద్రలేమి, ఆలస్యంగా లేవటం వంటివి వృత్తిపరమైన సమస్యలకే కాదు, దైనందిక జీవనశైలి, జీవక్రియలకు సైతం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి నిద్రలేమి, నిద్రాభంగం వంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంటుంది. రోజూ త్వరగా నిద్రలేవడం కారణంగా యోగావంటి ఆరోగ్యకర జీవనానికి సమయాన్ని కేటాయించగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవాటు అవుతుంది. ఫలితంగా ఆరోగ్యంపరంగా, కెరీర్‌పరంగా ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు.